పిఠాపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
 
=
==పిఠాపురం చరిత్రా విషయాలు ==
పిఠాపురాన్ని పూర్వం '''పీఠికాపురం''' అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన [[ఉసిరి కాయ,]] మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో [[షణ్ముఖుడు|కుమారస్వామి]] ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు [[శ్రీనాథుడు|శ్రీనాధుడు]] [[భీమేశ్వర పురాణం]] లో ఈ కింది విధంగా చెబుతాడు.
 
: "హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
: ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
: గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
: గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
 
పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు [[శ్రీనాధుడు]] అలా అనేసి ఊరుకోకుండా-
: "ఏలేటి విరినీట నిరుగారునుంబండు
: ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
 
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు [[పనస]] చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. [[సింహాచలం]] వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. అన్నవరం దగ్గర ఉన్న పంపా నది కూడ సాగర సంగమం చెందే ముందు ఈ ఏలేటి నీటితో పొన్నాడ దగ్గర కలుస్తుందని చిలుకూరి పాపయ్య శాస్త్రి "శ్రీనాధ కృతి సమీక్ష" అనే పుస్తకంలో రాసేరు. ఒడ్డె రాజులతో వైరం పూనిన విజయనగరం గజపతులు ఈ నదుల సాగర సంగమ స్థానాన్ని పూరీ జగన్నాథంతో సమానమైన దివ్య క్షేత్రంగా రూపొందిద్దామని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవి విగ్రహాలని ప్రతిష్ట చేసేరుట. ఈ జగన్నాథ స్వామి చేతులు ఇటీవల మొండి అగుటచే ఈ స్వామిని "మొండి జగ్గప్ప" అని ప్రాంతీయులు పిలుస్తారు.
 
పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం,శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం" గా ఏర్పాటు చేయబడింది , శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు ,భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురం లో మాత్రమే కలదు ,మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు కలవు.
 
==ఇతర ఆలయాలు==
"https://te.wikipedia.org/wiki/పిఠాపురం" నుండి వెలికితీశారు