తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కోస్తా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 29:
[[File:Gollalamamidada temple gopuram Eastgodavari.JPG|thumb|రామాలయం, గొల్లల మామిడాడ]]
[[File:Draksharama.jpg|thumb|ద్రాక్షారామం]]
=== హిందూరాజ్యాలు ===
తూర్పుగోదావరి జిల్లాను ప్రారంభ చరిత్రను అనుసరించి మిగిలిన [[దక్కన్ పీఠభూమి]]లాగా మౌర్యులు మరియు నందుల చేత పాలించబడింది. మౌర్యసామ్రాజ్య పతనము తరువాత మూడవ శతాబ్ధం ప్రముఖ కవి మరియు రాజు అయిన హలచక్రవర్తి వరకు ఈ ప్రదేశం శాతవాహనుల చేత పాలించబడింది. త్రవ్వకాలలో లభించిన నాణ్యాలు అధారంగా గౌతమీపుత్ర కులకర్ణి, వాసిష్టీ-పుత్ర పులుమాయి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి పాలించినట్లు నిరూపితమైంది. 350 ఎ.డి లో పిష్టాపుర మరియు అవాముఖ కాలంలో ఈ ప్రదేశం మీద సముద్రగుప్తుడు దండెత్తినట్లు అధారాలు ఉన్నాయి. సముద్రగుప్తుని దండయాత్ర తరువాత ఇక్కడ 375-500 వరకు మద్రసామ్రాజ్యం పాలనసాగింది. వీరిలో మొదటి పాలకుడు '''మహారాజా శక్తివర్మ'''.
 
ఈ జిల్లా తరువాత 5వ శతాబ్ధంలో ''' విక్రమ వర్మ కాలంలో ''' విష్ణుకుండినుల హస్థగతం అయింది. విష్ణుకుండినుల సామ్రాజ్యం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా వరకు విస్తరించింది. వశిష్ఠకుల పాలకులను '''ఇంద్రభట్టారకుడు''' ఓడించి
వుష్ణుకుండినుల సామ్రాజ్యం స్థాపించాడు. అయినా త్వరితంగా కళింగ సైన్యాల చేత ఓడింపబడ్డాడు. ఇంద్రభట్టారకుడు తరువాత మూడవ మాధవర్మా మరియు మంచన్న భట్టారక పాలన కొనసాగింది. వీరు తమ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలని ప్రయత్నించారు. ఈ వంశపు కడపటి చక్రవర్తి మూడవ మాధవర్మ.
 
తూర్పుగోదావరి జిల్లాలో అనేకమంది రాజవంశీయులు జమిందారులు ఉన్నారు. రాజపుత్రులు అయిన సూర్యవంశ రాజుల వారసులు ఈ జిల్లాలో 12వ శతాబ్ధంలో ఇక్కడకు వలస వచ్చారు. ప్రముఖ జమిందారులు పెద్దాపురం, తుని, రామచంద్రపురం వాళ్ళు. ఇక్కడ జగపతులు అని బిరుద నామంతో పిలువబడుతున్న వత్సవై రాజులు కూడా ఉన్నారు.
 
=== చాళుక్యులు చోళులు ===
బాదామి చాళుక్యులకు చెందిన రెండవ పులకేశి మరియు ఆయన సోదరుడు విష్ణువర్ధనుడు పిష్టాపురాన్ని 7వ శతాబ్ధంలో అధిపత్యం వహించాడు. కుబ్జ విష్ణు వర్ధనుడు స్థాపించిన తూర్పు చాళుక్య సామ్రాజ్యం మొదట పిష్టాపురాన్ని తరువాత వేంగి మరియు రాజమండ్రి వరకు పాలించాడు. అనేక రాజులు పాలించిన కారణంగా వారి వంశస్థుల పాలనా చరిత్ర వివాదాస్పదమౌతుంది. మొదటి చాళుక్య చక్రవర్తి భీమా దాక్షారామంలో శివాలయం ఆలయనిర్మాణం చేసాడు. 1973లో ఈ సామ్రాజ్యపు చక్రవర్తి అయిన ధనార్వుని పెదకల్లు(కర్నూలు జిల్లా) జాతచోడ భీమ చంపి వేంగిని ఆక్రమించుకున్నాడు. ధనార్వుడి ఇద్దరు కుమారులైన మొదటి శక్తివర్మ మరియు విమలవర్మ పారిపోయి మొదటి రాజరాజచోళుని సభలో ప్రవేశించి ఆయనను ఆశ్రయించాడు. రారాజ చోళుడు ధనార్వుని కుమారుల తరఫున వేంగి మీద దండెత్తి జాతచోడ భీమను చంపాడు. కల్యాణికి చెందిన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన సత్యరాయునికి వేంగి ప్రాంతం మీద చాళుక్యుల ఆధిపత్యం నచ్చలేదు. ఆ కారణంగా కారణంగా చోళులు మరియు చాళుక్యుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. 175 ఎ డి లో ఏడవ విజయాఅదిత్యుడి మరణం తరువాత తూర్పు చాళుక్యసామ్రాజ్యం ముగింపుకు వచ్చింది.