తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
1470 కపిలేశ్వర గజపతి మరణించిన తరువాత ఆయన కుమారులైన హాంవీర మరియు పురుషోత్తమా మధ్య రాజ్యం కొరకు యుద్ధం చేసారు. బహ్మనీల సహాయంతో హంవీర రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అయినా ఆయన ఎక్కువ కాలం నిలువ లేదు. పురుషోత్తమ హంవీరను త్రోసి రాజమహేంద్రవరం మిగిలిన ప్రదేశాలను తిరిగి జయించాడు. కాని మూడవ మహమ్మద్ షా ఆధ్వర్యంలో సైన్యాలు రాజమహేంద్రవరానికి వచ్చాయి. ఈ యుద్ధం చివరకు శాంతి ఒప్పందంతో ముగిసింది. మూడవ మహమ్మద్ షా మరణించిన తరువాత పురుషోత్తమ గజపతి గోదావరీ మరియు కృష్ణా పరివాహక ప్రాంతమంతా దక్షిణంగా కొండవీటి వరకు బహ్మనీ సైన్యాలబ్ను పారద్రోలాడు. పురుషోత్తమా తరువాత ఆయన కుమారుడు ప్రతాపరుద్రా పాలనా పగ్గాలు చేపట్టాడు. విజయనగర సామ్రాజ్యాధినేతకృష్ణదేవరాయలు ఈ రాజ్యాన్ని లోబరుచుకుని తన సామంతరాజ్యం చేసుకున్నాడు. అయినా వారిరువురి నడుమ జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతాపరుద్రుని కుమార్తెను కృష్ణదేవరాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. అందుకు బదులుగా తాను జయించిన భూభాగాన్ని తిరిగి ఇచ్చాడు.
[[File:Tuni town view from Railway station.jpg|thumb|తుని]]
=== తరువాతి ముస్లిమ్ రాజులు ===]
[[గోల్కొండ]] పాలకుడు '''కుతుబ్ షాహి''' రాజ్యంలో ఏర్పడిన అననుకూల పరిస్థితులను తనకూలంగా మలచుకుని '''సుల్తాన్ కులీ కుతుబ్ షాహి''' కోస్తా ప్రాంతం మీద దండయాత్రచేసి రాజమండ్రి మరియు దాని పరిసర రాజ్యాలను కైవశం చేసుకున్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షాహి హత్యచేయడిన తరువాత అతడి కుమారుడైన '''జమ్షిద్ కుతుబ్ షాహ్''' తరువాత ఆయన మనుమడు '''సుభాన్‌కుతుబ్‌షాహ్'''సింహాసనం అధిష్టించాడు. అతడి పాలనా కాలంలో ఇబ్రహీం షితాబ్‌ఖాన్ మరియు విద్యాధర్ల నుండి సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అబ్దుల్ హాసన్ తానాషా ఈ ప్రదేశానికి చివరి పాలకుడు అయ్యాడు. ఆయన 1672-1687 మధ్య పాలన సాగించాడు. ఈ కాలంలోనే ముఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]] దక్షిణ భారతదేశం అతడి ఆధిపత్యంలోకి చేరింది. 1687 గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు జయించి స్వాధీనం చేసుకున్నాడు. అలాగే గోదావరి జిల్లా కూడా అతడి ఆధీనంలోకి వచ్చింది. అతడి సమ్రాజ్యంలోని 22 విభాగాలలో గోదావరి కూడా ఒకటి అయింది. ఔరంగజేబు ఈ సంస్థానాలను పాలించడానికి వైశ్రాయిని నియమించాడు. గోల్కొండ వైస్రాయ్ '''నిజామ్-ఉల్-ముల్క్''' ఈ ప్రదేశాన్ని ఫౌజ్‌దార్లు అనబడే సైనికాధికారుల నిర్వహణలో పాలించాడు. ముఘల్ చక్రవర్తి '''ఫర్రుక్‌సియార్''' దక్కన్ విభాగాన్ని పాలించడానికి నిజామ్- ఉల్ - ముల్క్ గా '''అసఫ్‌జాహ్‌'''ను నియమించాడు. '''ముహామ్మద్ షాహ్''' సమయంలో అసఫ్‌షాహ్ స్థానంలో '''హుస్సేన్ అలి ఖాన్ ''' ఖాన్ నియమించబడ్డాడు. 1724లో అసఫ్‌జాహ్ దక్కన్ మీద దాడి చేసి '''ముబరిజ్‌ఖాన్'''ను ఓడించి చంపి దక్కన్ ప్రాంతాన్ని [[హైదరాబాద్]] నిజాముగా చేసి పాలించాడు. ఈ యుద్ధం షకర్‌ఖేరా అని పిలువబడింది.
 
1748లో '''నిజామ్ ఉల్ ముల్క్''' మరణానంతరం ఆయన కుమారుడు నాసిర్‌జంగ్ మరియు మనుమడు ముజాఫర్‌జంగ్ మధ్య సింహాసనం కొరకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ చెరి ఒక వైపు చేరారు. ఫ్రెంచ్ జనరల్ '''బుస్సీ ''' సహాయంతో '''సలాబత్ జంగ్''' ప్రవేశించి ఈ వివాదాలకు ముగింపు పలికాడు. ఎలాగైతేనే జనరల్ బుస్సీ దక్షిణదేశానికి లల్లీతో ఒక ఆదేశం పంపాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రెంచ్ భారతదేశంపఇ ఆధిఖ్యత సాధించాడు. అయన పోయిన కొద్ది కాలంలోనే విజయనగర రాజు పసుపతి ఆనందగజపతి రాజా ఆంగ్లేయులకు '''నార్తెన్ సిర్కార్స్''' (ప్రస్థుత ఆమ్ఢ్రప్రదేశ్ మరియు ఒరిస్సా) ను ఆక్రమించుకొనమని ఆహ్వానం పంపాడు. ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయుల మధ్య చెలరేగిన ఈ కలహాలు చివరకు ఫ్రెంచ్ '''నార్తెన్ సిర్కార్స్''' ఆధిపత్యం వదులుకొనడంతో ముగిసాయి. చివరిగా ఫ్రెంచ్ ఆధిపత్యం వదులుకుంటూ తమ దక్కన్ ఆధిఖ్యానికి గుత్రుగా [[యానాం]]ను మాత్రమే తమ స్వాధీనంలో మిగుల్చుకొన్నది. ఫ్రెంచి వారు 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకూ యానంను తమ ఆధీనంలో ఉన్నది.
 
సలాబాత్ జంగ్ అతడి సోదరుడైన '''నిజామ్ అలి ఖాన్''' చేత తొలగించబడ్డాడు. తరువాత నిజామ్ అలి ఖాన్ రాజమండ్రి మరియు చికాకోల్(ప్రస్థుతం శ్రీకాఆకుళం) లను హాసన్ అలి ఖాన్‌కు లిజ్‌కు ఇచ్చాడు. 1765 ఆగస్ట్‌లో ముఘల్ చక్రవర్తి '''షాహ్ అలామ్''' తో చర్చలు జరిపి ఫలితంగా నార్తన్ సిర్కార్స్‌ మీద ఆధిపత్యాన్ని ''' బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ '''' కొరకు సాధించాడు. అయినా 1766 మార్చ్ వరకు ఇది రహస్యంగా ఉంచబడింది. కొండపల్లి కోటను ఆక్రమించిన బ్రిటిష్ ప్రభుత్వం అవసర సమయాలలో సైన్యాలను నడిపించడానికి '''జనరల్ సిల్లౌడ్ '''ను మచిలీపట్నానికి పంపింది. నిజామ్ కూడా చురుకుగా యుద్ధప్రయత్నాలను చేపట్టింది. కాని 1766 నవంబర్ 12 న జరిగిన ఒప్పందం కారణంగా యుద్ధం ఆగిపోయింది. ఫలితంగా ఆక్రమిత నార్తెన్ సిర్కార్ తిరిగి నిజామ్ ఆధీనంలోకి వచ్చింది.
 
ఈ జిల్లా బ్రిటిష్ అధీనంలోకి వచ్చే ముందు జమిందారుల ప్రాముఖ్యత అధికంగా ఉండేది. జమీందారులైన రంప, తోటపల్లి, జమ్మిచావడి, జద్దంగి, పెద్దాపురం, పిఠాపురం, కోట మరియు రామచంద్రపురం మొదలైనవిీ ప్రదేశంలో ప్రధానమైనవి.
[[File:Rail-Road bridge Godavari.JPG|thumb|గోదావరి రైలు వంతెన]]
 
=== బ్రిటిష్ పాలకులు ===