తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
=== కాకతీయులు ఢిల్లీ సుల్తానులు ===
 
]
=== ముసునూరి నాయకర్లు, రెడ్లు మరియు ఇతర హిందూరాజులు ===
ఢిల్లీ సుల్తానులు ప్రాంతీయ ప్రముఖులైన ప్రొలయా మున్సూరి నాయకుల తెగల నిరంతర తిరుగుబాటును ఎదుర్కొన్నారు. అద్దంకి రెడ్లు, పిఠాపురం కొప్పుల తెలగాలు మరియు రాచకొండ రేచర్ల వెలములు ఆయనకు సహకరించారు. [[వరంగల్లు]] స్వాతంత్ర్యం సాధించిన సందర్భంలో తెలుగు వారు 50 సంవత్సరాల అనంతరం తెలుగు భూమికి లభించిన స్వాతంత్ర్యానికి ఆనందించారు. మునుసూరి కపయ నాయకా తన బంధువులు అయిన అన్వొత నాయకా మరియు ముమ్మడి నాయకా (కోరుకొండ)లను గోదావరీ ప్రదేశానికి గవర్నర్లుగా నియమించాడు. ముమ్మడి నాయకా కపయ నాయకా మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. 1388 వరకు ముమ్మడి నాయకా జీవించాడు. ఆయనకు ముగ్గురు కుమారులు తరువాత 40 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించి కొండవీటి రెడ్లచేత అణిచివేయబడ్డారు. తరువాత కళింగరాజైన ఐదవ నరసింహదేవ ఈ ప్రదేశాన్ని జయించి పాలించాడు అయినా రాజమడ్రికి చెందిన అనవొత రెడ్డిచేత అది తిరిగిస్వాధీనపచుకోబడింది. ఆయన తరువాత అదే సామ్రాజ్యానికి చెందిన అనవేమరెడ్డి మరియు కుమరగిరి ఈ ప్రాంతాన్ని పాలించారు.
 
కుమరగిరి రాచకొండకు చెందిన రాచెర్లులు మరియు కళింగ రాజులతో అనేక యుద్ధాలు చేసాడు. ఆయన తన కుమారుడైన అనవోత వెంట సైన్యాధ్యక్షుడు కాటయ వేముని తూర్పు ప్రాంతాలను జయించడానికి పంపాడు. ఫలితంగా ఉత్తరంగా పలు ప్రాంతాలు సింహాచలం వరకు సామ్రాజ్యంలో చేరాయి. కొత్తగా లభించిన ప్రాంతం రెడ్డిరాజుల రాజ్యంలో చేరింది. అలాగే ఈ విభాగం ప్రత్యేకంగా తూర్పురాజ్యంగా పిలువబడింది. రాజకుమారుడు అనవోత రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన 1395 వరకు పాలించిన తరువాత చిన్న వయసులోనే మరణించాడు. తరువాత సైన్యాధ్యక్షుడు మరియు బావమరిది అయిన కాటయ వేమునికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాజమహేంద్రవరం లభించింది. కాటయ వేమను కొండవీటి సింహాసనం నుండి పెదకోమటి వేమ బలవంతంగా త్రోసి వేసిన తరువాత కాటయవేమ రాజమహేంద్రవరానికి వెళ్ళాడు.
పెదకోమటి వేమ కాటయ వేమను ఓడించబడిన తరువాత కాటయవేమకు ఎరువా సైన్యాధ్యక్షుడు అన్నదేవ చోడునితో యుద్ధం ఏర్పడింది. ఆయన రాజమహేంద్రవరం లోని చాలాభాగం ఆక్రమించుకోబడింది. ఎలాగైతేనే అతడు కాటయవేమతో తరమబడ్డాడు. కాటయవేమ అన్నదేవచోడునితో చేసిన ఒక యుద్ధంలో మరణించాడు. ఆయన మరణించిన తరువాత అల్లాడరెడ్డి కాతయవేమ కుమారుడిని రాజమహేంద్రవరం పాలకుడిగా చేసి తాను రాజప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని పాలించాడు. అల్లాడరెడ్డి 1423 లో తనకు మరణం సంభవించే వరకు ఈ ప్రాంతాన్ని పాలించాడు. 1443లో విజయనరం పాలకుడైన రెండవ దేవరాయ రాజు వీరభద్రుని ఓడించి ఈ రాజ్యాన్ని పాలించాడు.
 
కొండవీడులో పెదకోమటి వేమ తరువాత రాచవేమ సింహాసనాధిష్టుడయ్యాడు. ఆయన పాలన చాలా క్రూరంగా ఉండేది. ఒరిస్సా నుండి గజపతులు మరియు విజయనగర రాయలు దండెత్తినప్పుడు ఆయనకు ప్రజల నుండి కొంత సహాయం లభిస్తుండేది. కపిలేశ్వర గజపతి రెడ్డిరాజులను అణచివేసి రాజమహేంద్రవరాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు.
 
1470 కపిలేశ్వర గజపతి మరణించిన తరువాత ఆయన కుమారులైన హాంవీర మరియు పురుషోత్తమా మధ్య రాజ్యం కొరకు యుద్ధం చేసారు. బహ్మనీల సహాయంతో హంవీర రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అయినా ఆయన ఎక్కువ కాలం నిలువ లేదు. పురుషోత్తమ హంవీరను త్రోసి రాజమహేంద్రవరం మిగిలిన ప్రదేశాలను తిరిగి జయించాడు. కాని మూడవ మహమ్మద్ షా ఆధ్వర్యంలో సైన్యాలు రాజమహేంద్రవరానికి వచ్చాయి. ఈ యుద్ధం చివరకు శాంతి ఒప్పందంతో ముగిసింది. మూడవ మహమ్మద్ షా మరణించిన తరువాత పురుషోత్తమ గజపతి గోదావరీ మరియు కృష్ణా పరివాహక ప్రాంతమంతా దక్షిణంగా కొండవీటి వరకు బహ్మనీ సైన్యాలబ్ను పారద్రోలాడు. పురుషోత్తమా తరువాత ఆయన కుమారుడు ప్రతాపరుద్రా పాలనా పగ్గాలు చేపట్టాడు. విజయనగర సామ్రాజ్యాధినేతకృష్ణదేవరాయలు ఈ రాజ్యాన్ని లోబరుచుకుని తన సామంతరాజ్యం చేసుకున్నాడు. అయినా వారిరువురి నడుమ జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతాపరుద్రుని కుమార్తెను కృష్ణదేవరాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. అందుకు బదులుగా తాను జయించిన భూభాగాన్ని తిరిగి ఇచ్చాడు.
[[File:Tuni town view from Railway station.jpg|thumb|తుని]]
=== తరువాతి ]