పాణిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
=='''ప్రభావం'''==
 
పాణిని సూత్రాలకు ఎందరో మహా పండితులు ‘’వార్తికాలు ‘’రాశారు అందులో పతంజలి పేర్కొన్న వారు కాత్యాయనుడు ,భారద్వాజుడు ,సునాగుడు ,క్రోస్ట,బాడవుడు అనే అయిదుగురు ముఖ్యులు .వ్రుత్తి అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవ్రుత్తి అని అర్ధం .వార్తికం అంటే వ్రుత్తి కి వ్యాఖ్యానం .వార్తిక కారుదికే వాక్య కారుడు అనీ పేరుంది .వార్తికాలు లేక పోతే అష్టాధ్యాయి అసంపూర్ణం అయ్యేది .ఇవి వచ్చి నిండుదనాన్ని తెచ్చాయి .ఇందులో కాత్యాయనుని వార్తికం ప్రసిద్ధి పొందింది .కాత్యాయనుదికే వరరుచి ,మేదాజిత్ ,పునర్వసు ,కాత్యుడు అనే పేర్లున్నాయి .పాణిని ముఖ్య శిష్యుడే కాత్యాయనుడు .దక్షిణ దేశం వాడు .ఈ విషయాన్ని ఒక సూత్రం లో [[పతంజలి]] ప్రకటించాడు. పాణినీయం పై పతంజలి రాసిన భాష్యాన్ని ‘’మహా భాష్యం ‘’అంటారు .దీనికే ‘’పద.’’అనే పేరు కూడా ఉంది. సూత్రం లో వార్తికం లో అభిప్రాయ భేదం వస్తే ‘’పాతంజలీయం ‘’మాత్రమె ప్రమాణం. మహా భాష్యం పై ఎన్నో వ్యాఖ్యల వచ్చాయి .అందులో [[భర్తృహరి]] రాసినది ప్రాచీన మైనది .
 
అష్టాధ్యాయి పై అనేక వృత్తులు వచ్చాయి .పాణిని మేన మామ ‘’వ్యాడి ‘’అనే ఆయన ‘’వ్యాడి సంగ్రహం ‘’అనే పేర వ్రుత్తి రాశాడు .విక్రమార్కుని ఆస్థానం లో ఉన్న వరరుచి ఇంకో వ్రుత్తి రాశాడు .జయాదిత్యుడు ,వామనుడు కలిసి రాసిన వృత్తికి ‘’కాశికా వ్రుత్తి ‘’అని పేరు .ఇదీ గొప్ప పేరు పొందినదే .వీరిద్దరూ కాశీ లో ఉండి రాయటం చేత ఆ పేరొచ్చింది .అతి ప్రధాన వృత్తిగా కాశికా వ్రుత్తి కి పేరుంది .దీని తర్వాత చెప్పుకో తగ్గది’’ భర్తృహరి ‘’ అనే పేరు తో పిలువ బడే ఎనిమిదో శతాబ్దానికి చెందిన బౌద్ధ పండితుడు ‘’విమల మతి ‘’రాసిన ‘’భాగ వ్రుత్తి ‘’.16 వ శతాబ్దం వాడైన ‘’అప్పయ్య దీక్షితులు ‘’’’సూత్ర ప్రకాశిక ‘’అనే వ్రుత్తి రాశాడు .దయానంద సరస్వతి ‘’అస్టాధ్యాయీ భాష్యం ‘’అనే ప్రసిద్ధ గ్రంధం రాసి సుసంపన్నం చేశాడు .
"https://te.wikipedia.org/wiki/పాణిని" నుండి వెలికితీశారు