షోయబ్ ఉల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''షోయబ్ ఉల్లాఖాన్''' [[1920]], [[అక్టోబరు 17]] న [[ఖమ్మం]] జిల్లా [[సుబ్రవేడు]] లో జన్మించిన [[తెలంగాణా యోధుడు]].బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటి ప్రచురణ, 2006, పేజీ 293</ref> తండ్రి హబీబుల్లాఖాన్. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. తల్లి లాయహున్నీసా బేగం. షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం. వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడింది. షోయబ్ భార్య ఆజ్మలున్నిసా బేగం. వీరికి ఇద్దరు కుమార్తెలు. షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎ, జర్నలిజం డిగ్రీ చేశాడు. బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యాడు.తన కుమారునిలో మహాత్ముని పోలికలున్నాయని షోయబుల్లా తండ్రి మురిసిపోయేవాడు. ఈ కారణం చేతనే షోయబ్ ను ఆయన ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దుగా పిలుచుకునే వాడు. గాంధీలాగానే షోయబ్ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించడంలో నిబధ్ధతను, మొండితనాన్ని ప్రదర్శించాడు.ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మత దురహంకారులు 1948 ఆగష్టు 22న [[రజాకార్లు]] పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అతిక్రూరంగా కాల్చిచంపారు.
== వృత్తి జీవితం ==
షోయెబుల్లా ఖాన్ విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాకా జీవితాన్నంతా పత్రికావృత్తిలో గడిపారు. షోయబుల్లా రచనా జీవితం ''తేజ్'' పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖాసింరజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించారు. అటువంటి రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తేజ్ పత్రికను నిషేధించింది. ఆ సమయంలోనే ప్రసిద్ధ కాంగ్రెస్‌నాయకుడు ముందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న ''రయ్యత్'' పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది. అప్పటికే ముమ్మరంగా తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది. ఆ సందర్భంలో రయ్యత్ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది.

రయ్యత్ నిషేధానికి గురయ్యాకా షోయబుల్లా ఖాన్ స్వంత నిర్వహణలో ''ఇమ్రోజ్'' అనే దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు షోయబుల్లా స్వీకరించారు. రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి. పాకిస్తాన్‌కు కోట్లాది రూపాయలు ధనసహాయం చేయడం వంటి చర్యలు నిజాం, రాజ్యంలోని ప్రజలతో దాదాపుగా యుద్ధం చేస్తూ ఖాసింరజ్వీ పరిస్థితుల్ని మార్చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు ఒక పత్రాన్ని తయారుచేశారు. నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే సరైన నిర్ణయమని ఆ పత్రం సారాంశం. ఈ పత్రాన్ని ''ఇమ్రోజ్'' పత్రికలో యధాతథంగా షోయబుల్లా ఖాన్ ప్రచురించారు. ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం భయపడ్డాడు.
 
== [[బూర్గుల నరసింగరావు]] కథనం==
"https://te.wikipedia.org/wiki/షోయబ్_ఉల్లాఖాన్" నుండి వెలికితీశారు