పరమహంస యోగానంద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
యోగానంద, [[ఉత్తరప్రదేశ్]] లోని [[గోరఖ్‌పూర్]] లో ఒక సాంప్రదాయ బెంగాలీ కుటుంబంలో జన్మించాడు. <ref name=mejda>Ghosh, p. 3</ref> ఆయన తమ్ముడు సనందుడి మాటలను బట్టి యోగానంద చిన్నవయసు నుంచే ఆధ్యాత్మికతలో వయసుకు మించిన ఆసక్తిని, పరిణతిని కనబరిచేవాడు. <ref>Ghosh, p. 23</ref> యవ్వనంలో ఉండగా ఆయన తన ఆధ్యాత్మిక తృష్ణను తీర్చుకోవడానికి ఎంతో మంది భారతీయ సన్యాసులను కలిశాడు.<ref>Yogananda, p. 59</ref> చివరకు ఆయనకు 17 ఏళ్ళ వయసులో, 1910 సంవత్సరంలో యుక్తేశ్వర్ గిరిని తన గురువుగా కనుగొనడం జరిగింది. ఆయన గురువుతో కలిసిన మొట్టమొదటి కలయిక జన్మజన్మలకీ గుర్తుండిపోతుందని తన ఆత్మకథలో రాసుకున్నాడు.
 
[[కలకత్తా]]లోని స్కాటిష్ చర్చి కళాశాల నుండి ఆర్ట్స్ లో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1915, జూన్ లో కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల అయిన సీరాంపూర్ కళాశాలనుండి ఇప్పటి బి.ఏ డిగ్రీకి సమానమైన డిగ్రీని పొందాడు. అప్పట్లో దాన్ని ఏ.బి డిగ్రీగా వ్యవహరించేవారు. అక్కడ చదివే రోజుల్లో యోగానంద సీరాంపూర్ లోని యుక్తేశ్వర ఆశ్రమంలో సమయాన్ని గడిపేవాడు. 1956లో1916లో సన్యాస ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించి స్వామి యోగానంద గిరి అయ్యాడు.<ref>Yogananda, p. 217</ref> 1917లో యోగానంద పశ్చిమ బెంగాల్లోని దిహికాలో ఒక బాలుర పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలోఆధునిక విద్యాబోధన పద్ధతులతో పాటు యోగాభ్యాసము మరియు ఆధ్యాత్మిక చింతనను కూడా విద్యార్ధులకు బోధించేవారు. ఆ మరుసటి సంవత్సరం పాఠశాలను రాంచీకి తరలించారు.<ref>Yogananda, p. 240</ref> ఈ పాఠశాలే ఆ తర్వాత కాలంలో భారత యోగద సత్సంగ సమాజంగా రూపుదిద్దుకొన్నది. ఇది యోగానంద యొక్క అమెరికా సంస్థకు భారతీయ శాఖ. క్రియాయోగాన్ని బోధించడం వారు చేసిన పని.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పరమహంస_యోగానంద" నుండి వెలికితీశారు