దిద్దుబాటు సారాంశం లేదు
→‎రసికప్రియ: కొత్త విభాగం
పంక్తి 44:
|-
|}
 
== రసికప్రియ ==
 
ఈ 'రసికప్రియ[[అష్టవిధ నాయికలు| కేశవదాసు]]' అను హిందీ శృంగార కావ్యమున కేశవదాసు అను కవి రచించెను. కేశవదాసుడు బుందేల్ఖంద్https://en.wikipedia.org/wiki/Bundelkhand అను గ్రామ వాసి. ఈ గ్రామము ప్రస్తుతము ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో విస్తరించి ఉన్నది. రాజా మధుకరషా ఇతనికి ఆస్థానమున ఆశ్రయమిచ్చి సన్మానించెను. మధుకరుని అనంతరము అతని ఆసనమును అధిష్ఠించిన అతని కుమారుడు అంద్రజిత్తుషా ఇతని పాండితికి మెచ్చి 21 గ్రామములను బహుమతిగా ఇచ్చెను. కేశవదాసు రచనలలో రెండవది ఈరసికప్రియ. ఇది సుమారు క్రీ.శ. 1591 సం. రచింపబడినది. దీని తరువాతి రచన 'కవిప్రియ' అను అలంకార గ్రంధము. అది క్రీ.శ. 1601 సం. నాటిది.
హిందీ భాషయందు గల ప్రేమకావ్యములలో ఈ 'రసికప్రియట కు చక్కని పేరు గలదు. 17, 18 వ శతాబ్దములనాటి పహారీhttps://en.wikipedia.org/wiki/Pahari_painting చిత్రములు చాలా వరకు ఈ కావ్యమును అధారపడినవే. ఆ చిత్రములలో చాలావరకు అడుగు భాగమునను, కొన్ని వెనుక వైపున ఇతని పద్యములు రచింపబడినవి.ఒకప్పుడు అక్బరుచక్రవర్తి ఇద్రజిత్తుషాకు అవిధేయతగా 10 మిలియనుల రూపాయలు అపరాధమును విధించెను. ఆసందర్భమున కేశవదాసు అక్బరు అస్ఠానమునకు బయలుదేరి, అక్బరు మంత్రి వీరబలునితో ఈ విష్యమై రహస్యముగా మంతనమాడి ఈ రసికప్రియను ఆతనికి వినిపించెను. వీరబలుడు ఆతని పాండితికి మెచ్చి ఈ అపరాధమును రద్దు చేయిపించెను.రసికప్రియ 16 అధ్యాయముల కావ్యము. అందు ద్వితీయ, తృతీయ, సత్పమాధ్యాయములు బాగా ప్రాచుర్యము పొందినవి. నాయక లక్షణములను ద్వితీయాధ్యాయమునునందు, తృతీయాధ్యాయమునందు నయికా లక్షణములను, అష్టానయికావర్ణన సప్తమాధ్యాయమునందు వివరించెను. ఈ పహారీ చిత్రములందు చాలావరకు రాధా, కృష్ణులే నాయికా, నాయకులుగా చిత్రింపబడినవి. ఈ పహారీ చిత్రములు "The Journal of Indian Art and Industry" చాలా మట్టుకు వర్ణింపబడినవి.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Shankar1242" నుండి వెలికితీశారు