రేంబుటాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
రేంబుటాన్ కాయల తొక్క ఎరుపు లేక పసుపు రంగులో ఉండి అంతటా మెత్తటి ముళ్ళు వ్యాపించి వుంటాయి. కాయల్లో బాదం పప్పు ఆకారంలో తెల్లటి గింజ ఉండి దాని చుట్టూరా తెల్లటి రుచికరమైన గుజ్జు ఉంటుంది. కాయలు తినడానికి కొద్దిగా లిచ్చీ (Lychee) కాయల రుచిని పోలివుంటాయి.
==సాగు==
రేంబుటాన్ చెట్లు సుమారు 12 నుండి 15 మీటర్ల ఎత్తు పెరుగుతాయి . రేంబుటాన్ విత్తనాలు నాటిన 15 రోజుల్లో మొలకెత్తుతాయి. గింజల నుండి మొలకెత్తిన చెట్లు సుమారు 6 - 7 సంవత్సరాల తర్వాత కాపుకొస్తాయి. అంట్లు మాత్రము 3 లేక 4 సంవత్సరమునుండి కాపుకొస్తాయి. రైతులు సాధారణంగా నర్సరీలనుండి రేంబుటాన్ అంట్లను కొనుగోలు చేస్తారు. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరిగే రేంబుటాన్ చెట్లకు కనీసం 200 సెంటీమీటర్ల వర్షపాతం అవసరమవుతుంది. సముద్ర మట్టానికి 10 నుండి 500 మీటర్ల ఎత్తులో రేంబుటాన్ చెట్లు చక్కగా పెరుగుతాయి. నీటి సుదుపాయం పుష్కలంగా ఉండాలి. నీరు నిల్వవుండకుండా తేలికగా నీటిని పీల్చుకోగల మట్టి రేంబుటాన్ చెట్లకు అనువైనది. కాయలు పక్వానికి రావడానికి 4 - 5 నెలలు పడుతుంది. రేంబుటాన్ కూడా మేంగోస్టీన్ వలే కొబ్బరితోటలో అంతరపంటగా సాగు చేయాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మెట్టప్రాంతాలు కూడా రేంబుటాన్ సాగు అనుకూలం.
 
==మార్కెట్==
రేంబుటాన్ కాయల ధర సంపన్న వర్గాలకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. గ్రామాల్లో పరిచయం లేకపోయినా రేంబుటాన్ కాయలకు హైదరబాద్, ఢిల్లీ, కలకత్తా, బొంబాయి, చెన్నై వంటి మెట్రో నగరాల్లో విపరీతమైన డిమాండ్ వున్నది. కిలో కాయల ధర సుమారు 650 రూపాయలు పలుకుతున్నది. అయితే రేంబుటాన్ కాయల సాగు గురించి ప్రభుత్వానికి మరియు రైతులకు ఇంకా అవగాహన కలుగవలసియున్నది.
"https://te.wikipedia.org/wiki/రేంబుటాన్" నుండి వెలికితీశారు