వశిష్ఠ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
వసిష్ఠుఁడు వ్యాసాన్ని విలీనం చేసితిని.
పంక్తి 13:
[[వర్గం:హిందూ ఋషులు]]
[[వర్గం:హిందూ మతము]]
-----------------------------
వసిష్ఠుఁడు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. మహాతపస్సంపన్నుఁడు. ఇక్ష్వాకువంశస్థులకు పురోహితుఁడు. వైవస్వతమన్వంతరమున సప్తర్షులలో ఒకఁడు. ఇతని భార్య అరుంధతి. కొడుకులు శక్తి మొదలగు వారు నూఱుగురు. ఈతఁడు దక్షప్రజాపతి కూఁతురు అగు ఊర్జను వివాహమయి ఆపెయందు రజుఁడు, గోత్రుఁడు, ఊర్ధ్వబాహువు, సవనుఁడు, అనఘుఁడు, సుతపుఁడు, శుక్రుఁడు అని ఏడుగురు పుత్రులను పొందెను. వారు స్వాయంభువ మన్వంతరమున సప్తర్షులుగ ఉండిరి. ఇతఁడు తొలుత బ్రహ్మమానసపుత్రుఁడు అయి ఉండి నిమి శాపముచేత ఆశరీరమునకు నాశము కలుగఁగా మిత్రావరుణులకు మరల జన్మించెను. ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వసిని చూచి రేతస్సు స్ఖలితము అయి అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి వసిష్ఠుఁడును, అగస్త్యుఁడును పుట్టిరి. కనుక వీరు ఇరువురును కుంభజులు అనఁబడుదురు.
-------------------------------------
"https://te.wikipedia.org/wiki/వశిష్ఠ_మహర్షి" నుండి వెలికితీశారు