అగ్గిపుల్ల: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 78 interwiki links, now provided by Wikidata on d:q37507 (translate me)
పంక్తి 30:
[[వర్గం:గృహోపకరణాలు]]
 
{{Link FA|hu}}అగ్గిపెట్టె...ఎ'''పుడు పుట్టె?
{{Link FA|hu}}
సాధారణంగా మనం ఇంటిలో ఏదైనా వెలిగించడానికి వాడతాము. దీనితో అగ్నిని తయారుచేస్తారు. ఇవి అగ్గిపెట్టెల రూపంలో దుకాణాలలో అమ్ముతారు. ఒక అగ్గిపెట్టెలో చాలా అగ్గిపుల్లలుంటాయి.యివి అన్నీ ఒకే పరిమానం కలిగి ఉంటాయి. దీనికి రెండు పక్కల ఘర్షణ తలాలు ఉంటాయి. అగ్గిపుల్ల సాధారణంగా కర్రపుల్లకు ఒక చివర భాస్వరమునకు సంబంధించిన పదార్ధం అతికించి ఉంటుంది. ఈ చివరను అగ్గిపెట్టె పక్కనున్న తలంపై రాపిడి కలిగించినప్పుడు ఘర్షణవల్ల అగ్గి పుట్టి కర్రపుల్ల అంటుకుంటుంది,భారతదేశంలో అగ్గిపుల్లలు తయారు చేయు మొదటి కర్మాగారము భారతీయుల ఆధ్వర్యంలో అహ్మదాబాదు నగరంలో స్థాపించారు.
ఆదిమానవుడు రాయి రాయి రాపాడించి అగ్గిని రాజేయడం నేర్చుకున్నాడని పుస్తకాల్లో చదువుకున్నాం. మరి రాళ్లతో జనింపజేసిన అగ్గిని పెద్ద శ్రమలేకుండా అగ్గిపుల్లతో జనింపజేయడం ఎప్పటి నుంచి మొదలైంది, ‘అగ్గిపెట్టె’ వాడకం ఎవరిచేత ప్రారంభమైంది అంటే మాత్రం అంత సులువుగా సమాధానం చెప్పలేం. క్రీస్తుశకం ఆరో శతాబ్దంలో చైనీయులు తొలిసారి అగ్గిపుల్లను వాడటం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రాపిడి చేత మండే స్వభావం ఉన్న రసాయనాలను మిశ్రమంగా చేసి ఒక పుల్లకు అతికించడం ద్వారా చైనా వాళ్లు అగ్గిపుల్లను సృష్టించారు. అయితే అలాంటి పుల్లలన్నింటినీ ఒక బాక్స్‌లో పెట్టుకుని వాడుకునే ఐడియా మాత్రం చైనావాళ్లకు వచ్చినట్టు లేదు. క్రీ.శ. 18వ శతాబ్దంలో తొలిసారి యూరప్‌లో ‘అగ్గిపెట్టె’ వాడకంలోకి వచ్చినట్టు తెలుస్తోంది.
స్టిబ్నేట్, పొటాషియం కొలరేట్, గమ్, స్టార్చ్‌ల మిశ్రమంతో తయారు చేసిన అగ్గిపుల్లను, ఒక కరుకు కాగితంపై గీయడం ద్వారా ఆగ్గిపుడుతుందని జాన్ వాకర్ అనే ఇంగ్లిష్ రసాయన శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆయన ఆవిష్కరణే అగ్గిపెట్టెకు ఒక రూపం కల్పించింది. బాక్స్‌లో పుల్లలను పెట్టి, బాక్స్‌కు రెండు వైపులా ‘రఫ్ స్పేస్’ను ఉంచి అగ్గిపెట్టెను అగ్గిని జనింపజేసే ఆయుధంగా అందించారు. పేటెంట్ వీరులైన పాశ్చాత్యులు దీనికీ పేటెంట్ పొందారు. స్వీడన్‌కు చెందిన లండ్‌స్ట్రమ్ బ్రదర్స్ అగ్గిపెట్టె పేటెంట్ రైట్స్ సొంతం చేసుకున్నారు. 1862 లో బ్రేనల్ అనే బ్రిటిష్ పారిశ్రామిక వేత్త తొలిసారి అగ్గిపెట్టెలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. చెక్కపుల్లలతో మొదలైన అగ్గిపెట్టెల ప్రస్థానం మైనపు పుల్లలతోనూ కొనసాగుతోంది.
'''
"https://te.wikipedia.org/wiki/అగ్గిపుల్ల" నుండి వెలికితీశారు