ఆత్రేయ: కూర్పుల మధ్య తేడాలు

చి లింకుల సవరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
==ఆత్రేయ గురించి==
*రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని ఆయనపై ఓ ఛలోక్తి. కానీ ఆయన ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్తానో ఎందరికి తెలుసు అనేవారు.
 
 
*తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత ఆయనను ''బూత్రేయ'' అనీ అన్నారు.
 
 
*ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు "కళింగ" అందుకే "పల్లవి" తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే కళింగులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.
 
* తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. ఉదాహరణకి, [[తేనె మనసులు]] సినిమాలో ఈ రెండు పాటలు "'''ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు'''," "'''నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు'''." అలాగే [[ప్రేమ నగర్ప్రేమనగర్]] సినిమాలో "'''నేను పుట్టాను ఈలోకం ఏడ్చింది, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది'''." పాట, మరియు "'''తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా'''" పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా అనంతమే అవుతుంది.
 
* [[కృష్ణ]], [[శారద]] లు నటించిన "[[ఇంద్రధనుస్సు]]" సినిమాలోని పాట "'''నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి'''" అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. ఆయనే ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.
 
*ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే ఆయన రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, [[డాక్టర్ చక్రవర్తి]] సినిమాలోని "'''మనసున మనసై బ్రతుకున బ్రతుకై'''" పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి [[శ్రీశ్రీ]] గా లబ్ధప్రతిష్టుడైన శ్రీరంగం శ్రీనివాసరావు.
 
 
*వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే ...... సినిమాలో "'''కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిదానా'''" పాటని శ్రీ.శ్రీ రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.
"https://te.wikipedia.org/wiki/ఆత్రేయ" నుండి వెలికితీశారు