మున్నంగి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 158:
*మున్నంగి గ్రామము సర్వమతసమానమైనది. ఈ గ్రామములో హిందువులతో పాటు ముస్లీములు, క్రైస్తవులు కలసిమెలసి నివసిస్తున్నారు. హిందూ దేవాలయములతో పాటుగా చర్చి, మసీదులు కూడా కలవు. ఇక్కడ ఉర్దూ పాఠశాలకూడా ఉండుట దీనికి నిదర్శనం.
*మున్నంగి దేవాలయాలలో శివాలయము ప్రత్యేకమైనది. ఇది ఐదు గుళ్ళ సముదాయము.ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దైవస్వరూపము(శ్రీగంగా పార్వతీ సమేత శ్రీసకల కోటేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంభ సమేత శ్రీశైలమల్లిఖార్జున స్వామి, శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ షట్ క్రోణబాలత్రిపురసుందరీ దేవి, అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి) కలరు.ఈ ఐదు గుళ్ళకు ఒకే ద్వారముండుట ఈ గుడి ప్రత్యేకత. అందుకే ఈగుడిని "ఐదు దేవుళ్ళ గుడి"గా పిలుస్తారు.
* మున్నంగి గ్రామ కూడలిలో, 2014,ఏప్రిల్-8, మంగళవారం నాడు, శ్రీ రామభక్త హనుమంతుని విగ్రహాన్ని, మొదట గ్రామ వీధులలో ఊరేగించి, తరువాత ప్రతిష్ఠించినారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించినారు. [1]
* ఈ గ్రామానికి చెందిన శ్రీ అరిగ కోటిరెడ్డి (70) దాతృత్వంలో నిండైన మనిషి, కర్షకుడు, అన్నదాతలకు ఉత్తమ సలహాదారు. వీరు విద్యుత్తు సబ్-స్టేషను ఏర్పాటుకు కావల్సిన 60 సెంట్ల భూమిని, తను కొనుగోలుచేసి, ప్రభుత్వానికి ఇచ్చారు. పాఠశాలలో గది నిర్మాణానికి, 4 బస్ షెల్టర్లకూ, విరాళం ఇచ్చారు. ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి అవసరమైన 40 సెంట్ల స్థలాన్ని తన స్వంతనిదులతో కొనుగోలుచేసి ఇచ్చారు.
* అభివృద్ధిలో నేను సైతం అంటూ గ్రామానికి చెందిన శ్రీ బొంతు పిచ్చిరెడ్డి, విదేశాలలో ఉంటున్న కుమారుడు, కుమార్తెల ఆర్ధిక సాయంతో గ్రామంలో గ్రంధాలయ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు అందించారు. 5 లక్షల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి దోహదపడ్డారు.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/మున్నంగి" నుండి వెలికితీశారు