పశు పోషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
====దూడను వేరు చేసిన తరువాత====
===దూడ ఎదుగుదల===
పెరుగుదల సరిగా ఉందో లేదో చూడడానికి మధ్య మధ్యలో బరువు చూస్తూ ఉండాలి.
*మొదటి మూడు నెలలలో దూడల పోషణ అత్యంత కీలకమైనది
*ఈ దశలో పోషణ సరిగా లేకుంటే 25 -30 శాతం వరకూ దూడలు మరణిస్తాయి.
*చూడి పశువుకు నాణ్యమైన పశుగ్రాసాన్ని ఇవ్వాలి. చూడి కాలం చివరి 2 -3 నెలల్లో సాంద్ర దాణాలను పెట్టాలి.
*సాధారణంగా, పుట్టినప్పుడు దూడ బరువు 20-25 కిలో లు ఉంటుంది.
*క్రమం తప్పకుండా నులిపురుగుల మందు ఇప్పిస్తూ ఉంటే దూడలు నెలకి 10-15 కిలో లు చొప్పున పెరుగుతాయి.
 
===తగినంత వసతి ముఖ్యం===
దూడలను తల్లి నుంచి వేరు చేసే వయసు వచ్చే వరకూ విడి విడి దొడ్లలో ఉంచాలి. ఇలా విడి విడి గా ఉంచడం వలన అవి ఒకదాన్నొకటి నాకకుండా ఉండి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. దూడల దొడ్లు పరిశుభ్రంగానూ, పొడిగానూ ఉండి గాలీ వెలుతురూ బాగా రావాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన గాలి తగిలేలా ఉండాలే కానీ గాలి సరాసరి దూడలకు విసురుగా తగల కూడదు. దూడలను పొడిగా, హాయిగా ఉంచడానికి దూడల దొడ్డిలో నేల మీద గడ్డి గాదం పరవాలి. సాధారణంగా రంపపు పొట్టు కానీ గడ్డి కానీ వాడతారు. అధికంగా ఉన్న ఎండ నుంచి, శీతల వాతావరణం నుంచి, వర్షం నుండీ, గాలి నుండీ రక్షణకి వెలుపల ఉన్న పశువుల కొట్టాలను పైన సగం వరకూ మూసి ఉంచి, చుట్టూరా గోడను కట్టాలి. తూర్పున తెరుచుకుని ఉన్న దూడల దొడ్లలో పొద్దున్న పూట సూర్య రశ్మి వచ్చి, కొంచెం ఎండగా ఉన్న సమయాలలో నీడగా ఉంటుంది. తూర్పునుండి అరుదుగా వర్షాలు పడతాయి.
"https://te.wikipedia.org/wiki/పశు_పోషణ" నుండి వెలికితీశారు