తెలంగాణ విముక్తి పోరాట కథలు: కూర్పుల మధ్య తేడాలు

తెలంగాణా విముక్తి పోరాట కథలు సంకలనాన్ని పోరాట కథలతో పాటు సాయుధ పోరాటాన్ని ప్రతిబింబించిన ఆనాటి చిత్రాలు, ఛాయాచిత్రాలు జతచేశారు. తెలంగాణా సాయుధ పోరాటంతో అవినాభావ సంబంధాన్ని కలిగిన బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్ పోరాటాన్ని చిత్రీకరిస్తూ వేసిన చిత్రాలు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ సునీల్ జెనా ఆ సమయంలో నైజాంలో విస్తృతంగా తీసిన ఫోటోలు సంకలనంలో ఉపయోగించారు. తెలంగాణా పోరాటాన్ని నేపథ్యంగా స్వీకరించి తీసిన సినిమా [[మా భూమి]] స్టిల్స్‌ని, ప్రముఖ చిత్రకారులు చంద్ర, మోహన్‌లు వివిధ సందర్భాల్లో గీసిన బొమ్మలను కూడా వాడారు.
== కథల వివరాలు ==
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రచురితమైన కథలు ఎక్కువ సంఖ్యలో, అనంతర కాలంలో ప్రచురితమైనవి కొద్ది సంఖ్యలో ఈ సంకలనంలో చేరాయి. 1944లో ప్రచురించిన భాస్కరభట్ల కృష్ణారావు '''దావత్''', 1945లో వెలువడ్డ వట్టికోట ఆళ్వారుస్వామి '''చిన్నప్పుడే''', పొట్లపల్లి రామారావు '''న్యాయం''' కథలు, 1946లో ప్రచురితమైన కథల్లో వేనేపల్లి ఆంజనేయులు రచించిన '''పాడియావు''', ఆవుల పిచ్చయ్య రాసిన '''ఈతగింజిచ్చి తాటిగింజ లాగిన జమీందార్''', '''ఊరేగింపులు''', '''దౌరా''', లింగమూర్తి సింగరాజు రాసిన '''మనకే విజయం''', పి.వెంకటేశ్వరరావు రచన చేసిన '''దొరోరి పుణ్యాన బిచ్చం''', '''రహీంభాయి''', '''అదిపంట కాదా''', '''దొంగలు దొంగలు ఊళ్ళుపంచుకున్నారు''' కథలు సంకలనంలో చేరాయి. 1947లో వెలువడినదిగా భావిస్తున్న పర్చా దుర్గాప్రసాదరావు '''గెలుపు మనదే''', 1948లో ప్రచురితమైన ప్రయాగ కోదండరామశాస్త్రి రాసిన '''నవజాగృతి''', ధర్మరాజు రచించిన '''ఆక్షేపణ లేదు''', దాశరథి రాసిన '''రక్తాంజలి''', పర్చా దుర్గాప్రసాదరావు రచించిన '''కదిలిన పునాదులు''', కె.ఎల్.నరసింహం రాసిన '''అమరవీరుడు''', '''గొల్ల రామవ్వ''', నవకుమార్ '''దున్నేవానిదే భూమి''', అట్లూరి పిచ్చేశ్వరరావు '''విముక్తి''', మాన్సు '''జన్మహక్కు''', '''పల్లెగుండె''', రాంషా '''మస్తానయ్య మరణం''', లక్ష్మీకాంతమోహన్ '''మనం తెలుగువాళ్ళం''', నిడదవోలు లింగమూర్తి '''నిశిరాత్రివేళ నైజాం ముచ్చట్లు''', ఎం.వెంకటరావు '''జీవకార్యుణ్యచర్య''', తుమ్మల వెంకటరామయ్య రాసిన '''మీరు గెలుస్తారు''', '''పెళ్ళి చేశారు''', శారద(ఎస్.నటరాజన్) రచించిన '''కొత్త వార్త''', '''గెరిల్లా గోవిందు''', కొల్లి సత్యనారాయణ '''దున్నేవానికే''', తెన్నేటి సూరి '''సంధిలేదు''',
 
== మూలాలు ==
39,537

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1116433" నుండి వెలికితీశారు