చిల్లర దేవుళ్ళు (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
పాణికి పోనుపోనూ ఊళ్ళో దొరది ఎదురులేని శాసనమని తెలుస్తుంది. చిన్న చిన్న తప్పులు చేసినా, తన అధికారాన్ని ఏమాత్రం తక్కువచేసినా దొర ఎలాంటి కఠినశిక్షలు విధిస్తాడో తెలుస్తూంటుంది. దొరకీ కరణానికి వైరం ఉన్నా జనాన్ని అణచివేయాల్సి వస్తే మాత్రం ఏకమైపోవడం కూడా చూస్తాడు. గడీలో ఆడబాపగా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా దారుణమైన జీవితం. ఐతే ఆమె సారంగపాణిని ప్రేమిస్తుంది. దొర కూతురు మంజరి, మరోవైపు కరణం కూతురు తాయారు కూడా అతనిపై మనసుపడతారు. తాయారు మరో అడుగు ముందుకువేసి తనను పెళ్ళిచేసుకుంటే తండ్రి కరణీకం ఇప్పిస్తాననీ, లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనీ హెచ్చరిస్తుంది.
 
మరో వైపు భూతగాదాల్లో లంబాడీలను కరణం మోసం చేయగా ఆదుకోవాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా ప్రజలపైనే కాల్పులు జరుపుతారు. ఓ లంబాడీ స్త్రీపై అత్యాచారం చేయబోగా ఆత్మగౌరవంతో ఆ ప్రయత్నం నుంచి కాపాడుకునేందుకు పోలీసు అధికారిని చంపుతుంది. ఆ వెంటనే తానూ ఆత్మహత్య చేసుకుంటుంది. నిజాం మనుషులు కూలీలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే, ఆ తర్వాత అటు హిందువులూ కాలేక, ఇటు ముస్లిములుగానూ మనలేక పడే బాధలూ చిత్రీకరించింది. దొర బండి రోడ్డుపై వెళ్తూన్న సమయంలో బండికి ముందు మనిషి తప్పుకోమని అరుస్తూ పరుగులు పెట్టడం వంటివి చూపించారు. ఆ పనిచేసే మనిషి వెట్టిచాకిరీతో తిండి లేక ఎంత కునారిల్లిపోతాడో కూడా కళ్ళక్కట్టారుచిత్రించారు. నిజాం పాలనలో దెబ్బ తింటున్న తెలుగు భాషా సంస్కృతుల సముద్ధరణకు కంకణం కట్టిన మాడపాటి హనుమంతరావు కృషిని పాణి తెలుసుకోవడమూ నవలలో ఉంటుంది.
<!-- అలా అని ఇదేమీ ముక్కోణపు ప్రేమకథ కాదు. సాయుధ పోరాటానికి పూర్వం తెలంగాణా ప్రజల బతుకు పోరాటాన్ని చిత్రించిన నవల. భూతగాదాలో లంబాడీలను కరణం మోసగిస్తే, న్యాయం చేయాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా లంబాడీలపై కాల్పులు జరుపుతారు. నిజాం మనుషులు రోజు కూలీలని బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే, ఆ తర్వాత వాళ్ళు ఇటు హిందువులుగానూ, అటు ముసల్మానులుగానూ చెలామణి కాలేక, రెండు మతాల చేతా వెలివేయబడి పడే బాధలు వర్ణనాతీతం. దొర బండి రోడ్డున వెళ్తుంటే, గడీ గౌరవానికి చిహ్నంగా బండికి ముందు ఒక మనిషి పరుగు పెట్టడం లాంటి సంప్రదాయాలని చిత్రించడం మాత్రమే కాదు, అలా పరుగు పెట్టే మనిషి పడే కష్టాన్నీ కళ్ళకు కట్టారు రచయిత.