"సుదర్శన శతకం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
శ్రీ రంగనాధుని సన్నిధిలో దివ్య ప్రబంధగానము చేయు సాత్వికులైన శ్రీ తిరువరంగ పెరుమాళరైయర్ స్వామి తీవ్ర వ్యాధిచే బాధ పడుతున్న సమయం లో, వారి బాధ చూచి సహించలేక పొఇన శ్రీ కూరత్తాళ్వాన్ సతీమణి, కూరనారాయణ మునివరులను చూచి, అరైయర్ స్వమి యొక్క వ్యాధి పరిహార్ధమై మీ మంత్ర శాస్త్రము వినియోగించరాఅదా అని అడుగగా, రచించినదే ఈ సుదర్శన శతక స్తోత్ర రాజము.
ఈ శతక రచన గూర్చి వేరొక వృత్తాంతము కూడా కలదు. ఒకప్పుడు శ్రీ రంగనాధుని వైభవమును చూచి సహింపలేకపోయిన ఒక ప్రభువు , ఒక మంత్రవేత్త సహాయంతో రంగనాధుని కళలను అపహరించదానికి నియమించాడు. ఆ ప్రభావం వలన శ్రీ రంగనాధుదు శేష శయ్య పైనుండి నాలుగు అంగుళములు పైకి లేచి కనపడగా ...అర్చకులు పెద్దలు ఈ విషయాన్ని శ్రీ కూర నారాయణ మునివరులకు విన్నవించగా ..ఇది మంత్రవేత్త ప్రభావమని గుర్తించి వానిని పట్టుకొని స్వామి ని యాధాస్థానమున దించవలెనని తలచినారు. అందుకు ఉపాయముగా ఆ రోజు ప్రసాదములో ఆవపొడి ఎక్కువ వేయించినారు.. అట్లు స్వామి ని అపహరించదలచిన మంత్రవేత్తలు బలిహరణ మెతుకులు తినవలెనని నియమము కలదు.. ఈ విషయము తెలిసి కూర నారాయణులు ఆవ పొడి ని పులిహోర యందు కలిపించారు. రోజూ మాదిరిగానే కళ్ళకు అంజనం వ్రాసుకొని ఆ మంత్రవేత్త బలిహరణ మెతుకులు తినడానికై వచ్చి తినగా, ఆవపొడి ఘాటు వలన కన్నీరు కారగా అందువలన కంటికి రాసుకొనిన అంజనపు కాటుక కరిగిపోగా పట్టు పడిపోయినాడు ఆ మాంత్రికుడు.. అతడి ద్వారానే విషయమును తెలిసికొని శ్రీరంగనాధుని ఆభరణములు ఇచ్చివేయుదుమని ప్రలోభపెట్టి ఇచ్చివేసి, శ్రీ రంగనాధుని మరల ఆ మంత్రవేత్త చేతనే యధా పూర్వముగ కళలతో అలరారునట్లుగా చేయించినారు.............
ఇట్టి దుష్ట స్వభావము కలిగిన వాని వలన మరల ఎప్పుడైనా ఏ దేవాలయములోనైనా ఇట్టి ప్రమాదము జరుగవచ్చును అని భావించి ఇట్టి మంత్రవేత్త జీవించుత దివ్య దేశ వైభవమునకు హానికరమని తలంచిన శ్రీ కూరనారాయణులు వాడి తోడుగా వెళ్ళిన మల్లులచేతనే వాడిని వధింపచేసి మరల శ్రీ రంగనాధుని ఆభరణరాషిని శ్రీస్వామివారి భందాగారములోభండాగారములో చేర్పించిరి. సంహరింపచేయుట వలననే నేమో కూరనారాయణుల 'పవన శక్తి ' కుంటుపడినది. అపుడు వీరు నూరు త్రాళ్ళుతో నిర్మింపబడిన ఒక ఉట్టిని గాలిలోనికి వ్రేలాడదీయించి తాము అందుండీ, ఈ సుదర్శన శతకమందలి ఒక్కొక్క శ్లొకమును పటించుచూ ఒక్కొక్క త్రాటిని తొలగించసాగారు. అట్లు నూరు శ్లొకములు పూర్తి అయినప్పటికి నూరు త్రాళ్ళను చేదించినా శ్రీ కూరనారయణ జీయర్ క్రింద పడిపోక వియత్తలముననే నిలువగలిగినారు. ఇట్లు వీరు కోల్పోఇన 'పవన శక్తి ' ని తిరిగి పొందునటూల చేసినదీ సుదర్శన శతక స్తోత్ర రాజము ఈ స్తోత్రము పటించువలన ఎంత శక్తి కలుగునో వినుట చేతకూడ అంతే ప్రయోజనము కలుగును అందకే ఆస్తికులందరూ ధర్మార్థ కామ మోక్షాది నిమిత్తమై ఈ స్తోత్రమును పారాయణాదులు జరిపించెదరు.
 
"యస్యస్మరణ మాత్రేణ విద్రవంతి సురారయ:, సహస్రార నమస్తుభ్యం విష్ణు పాణి తలాశ్రయ:" ఎవ్వని స్మరించిన మాత్రముననే అసురరాక్షసాదులందరూ భయపడి పరుగులు పెట్టుదురో, అట్టి మహత్యము గల శ్రీమన్నారయణుని పాణి తలమున అలంకరించి ఉండు ఓ సహస్రార దేవా ! నీకు నమస్సులు.
 
శ్రీ సుదర్శన శతకము ఆరు వర్ణనములతో నూరు శ్లోకములతో అలరారుతుంది. జ్వాలా వర్ణనము 24 శ్లోకములు, నేమి వర్ణనము 14 శ్లోకములు, అర వర్ణనము 12 శ్లోకములు, నాభి వర్ణనము 11 శ్లోకములు, అక్ష వర్ణనము 13 శ్లోకములు మరియు పురుష వర్ణనము 26 శ్లోకములు కలిగి 101 శ్లోకము ఫలశ్రుతిగా చెప్పబడినది.
==శతకంలోని శ్లోకాలు==
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1120272" నుండి వెలికితీశారు