వశిష్ఠ నారాయణ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
==వ్యక్తిగత జీవితం==
1973 లో ఆయనకు సైనిక అధికరి అయిన డా.దీప్ నారాయణ సింగ్ కుమార్తె అయిన "వందనా రాణి" తో వివాహమైనది. వశిష్ట నారాయణ సింగ్ తల్లిగారి కథనం ప్రకారం వివాహమైన మూడు రోజుల తరువాత ఆయన భార్య బి.ఎ పరీక్షలు వ్రాయుటకు తన కన్నవారింటికి వెళ్ళినదనీ, ఆయన కలకత్తాకు తిరిగి వెళ్లారనీ, అందువలన ఆయన సహోద్యోగులు ఆయనపై అసూయపడేవారనీ తెలిపారు.<ref>[http://theranveer.blogspot.in/2013/04/a-great-mathematician-dr-vashishtha.html theranveer.blogspot.in]</ref> అందువల్లనే ఆయనకు మొట్టమొదటిసారి మతిస్థిమితం లేకుండా అయినది. ఆయన కుటుంబం ఆయనకు వారి స్తోమత ప్రకారం వైద్యాన్ని అందించింది. ఆయనను 1976 లో రాంచీ లోని మెంటల్ హాస్పటల్ లో చేర్పించుటకు "నెటర్తాట్ ఓల్డ్ బోయ్స్ అసోసియేషన్" కీలక పాత్ర పోషించింది.
 
కార్పూరి ఠాకూర్ వారి పరిపాలనలో ఆయనకు రాంచీ లోని "డేవిడ్ క్లినిక్" అనే ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. అచట ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా వృద్ధి చెందింది. కానీ తరువాతి కాలంలో బీహార్ లో ఏర్పడిన ప్రభుత్వం ఆయన ఆరోగ్యం పై ఖర్చుచేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఆయన 1976 నుండి [[:en:Schizophrenia|షిజోఫ్రెనియా]] అనే వ్యాధితో బాధ పడుతున్నారు. దీని ఫలితంగా ఆయన డేవిడ్ క్లినిక్ నుండి రాంచీ మెంటల్ హాస్పటల్ కు పంపించబడ్డారు.
 
అదే కాలంలో వశిష్ఠబాహు ఆమె భార్య విడాకులు తీసుకొన్న మరియొక మసస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో వైద్యులు ఈ దురదృష్టకర సంఘటన జరిగడం తన మానసిక స్మృతి తప్పడానికి కారణమని తెలిపారు. ఆయన ఒక సన్యాసి భార్య (అరుంధతి) ని కోరుకున్నారు. కానీ ఆయన కు ఒక స్త్రీ తటస్థించింది. ఆమె ఆయనతో "మీరు ఒక విలువైన వ్యక్తి కావచ్చు, కానీ మీరు నాకు యోగ్యత లేని వ్యక్తి" అని పలికింది. ఈ మాటలు ఆయన హృదయాన్ని గాయపరచింది.
 
1989 లో ఆయన తండ్రి మరణం తరువాత వశిష్ట బాబు ఆయన స్వగ్రామాన్ని సందర్శించాడు. ఆయన ఒక ఉపన్యాసాన్ని కూడా యిచ్చాడు. ఆ సమయంలో ఆయన సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఆయన తండ్రి అంత్యక్రియలు చేసిన తరువాత రాంచీ వెళ్ళాడు. అచట ఆయన సోదరుడు అయోధ్య ప్రసాద్ వైద్యులతో సంప్రదించి ఆయనను పూనే నుండి వశిష్ట బాబుతో పాటు భగల్పూర్ జనతా ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరాడు. దారిలో వశిష్ఠబాబు మధ్యప్రదేశ్ లోని గదర్వారా స్టేషన్ లో నిశ్శబ్దంగా దిగాడు. అతని సోదరుడు అతన్ని గుర్తించేందుకు గట్టి ప్రయత్నం చేశాడు, కానీ ఫలించలేదు.ఆయన కుటుంబం మరియు గ్రామస్థులు ఆయన మరణించాడనీ, ఆయన ఆరోగ్యానికి మరణం అదృష్టమనీ భావించారు. కానీ 1993 లో శరణ్ జిల్లా, డోరిగంజ్ లో ఆయన హఠాత్తుగా కనిపించారు. ఆయన గ్రామస్థులు బసంతపూర్ పుత్రుడికి స్వాగతం యివ్వడానికి బయలుదేరారు.
 
==మూలాలు==