కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 162:
====భగవాన్ మహావీర్====
ఈ విగ్రహం మూల విరాట్టుకు కుడి వైపున గల గర్భ గుడి లో ఉన్నది. ఈ విగ్రహం కుంభకంతో కూడిన సిద్దాసనం మరియు అర్ధ పద్మాసనంలో ప్రశాంతమైన యోగముద్రలో ఉన్నది. వేళ్ళు పొడువుగా ఉన్నాయి. నవ్వు ముఖం, పాల భాగం విశాలంగా ఉండి చుబుకం మనోహరంగా ఉన్నది. వజ్ర విశేషజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఇది ఫిరోజా రాతితో నిర్మించబడింది. ఇలాంటి అత్యధ్బుతమైన ప్రతిమ భారత దేశంలో మరెక్కడా లేదు.
 
==శిల్పకళ==
ఆలయ ప్రవేశ ద్వారం చూస్తే కోటద్వారాన్ని తలపిస్తుంది.అక్కణ్ణుంచి రెండు నల్లని ఏనుగులు లోపలికి ఆహ్వానిస్తున్నట్లుంటాయి. ఆలయ నిర్మాణానికి ఢోల్‌పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటకు వచ్చేందుకు కుడిపక్కా ఎడమపక్కా రెండు ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం. ప్రతి స్తంభంలోనూ సూక్ష్మచిత్రకళ అబ్బుర పరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాథుడు లాంటి జైనదేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయం లోనికి అడుగుపెట్టగానే ఎడమవైపునుంచి తీర్థంకరుల బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉన్నాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయం చుట్టుపక్కల చెట్లు, ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ ఆవరణమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో నలుగురు తీర్థంకరుల బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైనుల పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/కొలనుపాక" నుండి వెలికితీశారు