"మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు కధా రచయితలు తొలగించబడింది; వర్గం:తెలుగు కథా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉ...)
'''మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి''' గారు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖులు, ఇటీవలివారు. వీరి నివాసం [[రాజమండ్రి]]. ఈయన రచనల్లో ముఖ్యమైనది ఆంధ్ర పురాణం. ఈ కృతికిగానూ వీరికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
[[దస్త్రం:Madhunapantula satyanarayana sastry.JPG|right|250px|thumb|మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]]
ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితులైన మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారు 20వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ఉద్భవించిన మహాకవి. శాస్ర్తీగారి పేరు తలచగానే మన స్మృతి పథంలో మెదిలేవి వారి మూడు రచనలు. అందులో ఒకటి ఆంధ్ర పురాణము, రెండవది [[ఆంధ్ర రచయితలు]], మూడవది ఆంధ్రి మాసపత్రిక. ఇవి త్రివేణి సంగమంవలె భావిస్తాయి.
 
ఆంధ్ర దేశంలో ప్రాచీన కాలం నుండి చారిత్రక ఇతివృత్తంతో కవులు కావ్యాలు వ్రాయడం పరిపాటి. శాస్ర్తీగారు ఆంధ్రుల చరిత్రను తొమ్మిది పర్వాలుగా ఉదయ పర్వం నుండి నాయక రాజుల చరిత్ర వరకు వ్రాశారు. ఇది ఇరవయ్యవ శతాబ్దంలో ఉద్భవించిన చారిత్రక పంచకావ్యాలలో ఒకటి. మిగిలినవి ఒంగళి-కాటూరి కవుల ‘‘సౌందరనందము’’ దుర్భాక రాజశేఖర శతావధానిగారి ‘‘రాణా ప్రతాప సింహచరిత్ర’’, శతావధాని గడియారం వేంకట శేషశాస్ర్తీ గారి ‘‘శ్రీ శివభారతము’’, తుమ్మల సీతారామమూర్తి గారి ‘‘బాపూజీ ఆత్మకథ’’ అనేవి. శాస్ర్తీగారు రచించిన ‘‘ఆంధ్ర పురాణము’’ చరిత్ర కావ్యమైన సాహిత్య సౌరభంతో గుబాళించే రసవత్తర కావ్యం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1131433" నుండి వెలికితీశారు