"హుమాయూన్" కూర్పుల మధ్య తేడాలు

2,089 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (+వర్గం:1508 జననాలు; +వర్గం:1556 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
'''నాసిరుద్దీన్ ముహమ్మద్ హుమాయాన్''' ('' అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్ ఖాఖాన్ అల్-ముకర్రమ్, జామ్-ఇ-సల్తనత్-ఎ-హఖీఖి వ మజాజి, సయ్యద్ అల్-సలాతీన్, అబుల్ ముజఫ్ఫర్ నాసిర్ ఉద్దీన్ ముహమ్మద్ హుమాయూన్ పాద్షాహ్ గాజి, జియాఉల్లాహ్'') ([[పర్షియన్]] : '''نصيرالدين همايون''') ([[మార్చి 6]] [[1508]] – [[ఫిబ్రవరి 22]] [[1556]]), [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యపు]] రెండవ చక్రవర్తి. ఇతను [[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]] మరియు ఉత్తర భారత ప్రాంతాలను పాలించాడు. 1530–1540 మరియు తిరిగి 1555–1556 వరకూ పరిపాలించాడు. ఇతడి తండ్రి [[బాబరు]]. కుమారుడు [[అక్బర్]].
హుమాయూన్ చక్కని విద్వాంసుడు. జ్యోతిష్యభూగోళ శాస్త్రములందు అభిరుచి గల యీచక్రవర్తి స్వోపయోగార్ధము భూగోళఖగోలకు ప్రతికృతులను (ఘ్లొబెస్)నిర్మించుకొనెను. జాతకభాగమునందున దీతనికి ప్రబలమగు విశ్వాసముండెడిది. పంచ భూతములయొక్క తత్వమును విమర్చించుచు ఈతడొక గ్రంధమును రచించెను. తన దర్సనమొనర్చి తన ఆదరమునుబడయు జనులను ఈతడు కొన్ని తరగతులుగా విభజించి యందు విద్వాంసులకు మతప్రచారకులతోడను, ధర్మశాస్త్రజ్ఞులతోడను సమముగ అగ్రస్థానమునొసంగెను. ఖగోళమునందు గ్రహముల పేరిట దివ్య భవనములను నిర్మిచి యీచక్రవర్తి శనిగురువుల భవనములలో విద్వత్సమానము నొనర్చుచుండెను. యుద్ధ రంగములకేగునపుడు, తుదకు ప్రాణములకై పరుగెత్తినపుడుగూడ ఈతడు గ్రంధములనుమాత్రము విడువకుండెనట.ఈచక్రవర్తి నిర్మించిన విద్యాలయములలో ఢిల్లీ నగరమందలి కళాశాలయు, ఆగ్రానగరమున కెదురుగ యమునా తీరమందలి మరియొక విద్యాలయమును ముఖ్యమయినవి.
 
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1142676" నుండి వెలికితీశారు