1,84,806
దిద్దుబాట్లు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) (→చరిత్ర) |
||
==చరిత్ర==
1953 లో
▲1953 లో భారతదేశంలో నిర్మింపబడిన వివిధ భాషా చిత్రాలనుంచి ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ చిత్రాలకు పురస్కారాలు అందచేయాలని 1954 లో ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నిర్ణయించింది. ఆ విధంగా భారతదేశంలో ఉత్తమ చలనచిత్రాలకు పురస్కారాలు అందచేయడమనే ప్రక్రియ మొదలయిందని చెప్పుకోవచ్చు. ఈ పురస్కారాలను అప్పట్లో “స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్” గా పిలిచే వారు.
నిజానికి 1949 ఆగష్టు నెలలో అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి చెందిన సెన్సార్ బోర్డ్ ప్రెసిడెంట్ రాసిన ఒక లేఖలో ఆ యేడు నిర్మింపబడిన తెలుగు మరియు తమిళ చిత్రాలనుంచి ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ చిత్రాలకు 500 రూపాయల బహుమతి ప్రధానం చేయబడుతుందని ప్రకటించారు. కానీ ఆ అవార్డులు నిజంగానే అందచేశారా? ఒక వేళ చేసి ఉంటే ఆ బహుమతులు అందుకున్న సినిమాలు ఏవి? అనే విషయం మాత్రం ఎక్కడా లభించలేదు.
|