భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
నిజానికి 1949 ఆగష్టు నెలలో అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి చెందిన సెన్సార్ బోర్డ్ ప్రెసిడెంట్ రాసిన ఒక లేఖలో ఆ యేడు నిర్మింపబడిన తెలుగు మరియు తమిళ చిత్రాలనుంచి ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ చిత్రాలకు 500 రూపాయల బహుమతి ప్రధానం చేయబడుతుందని ప్రకటించారు. కానీ ఆ అవార్డులు నిజంగానే అందచేశారా? ఒక వేళ చేసి ఉంటే ఆ బహుమతులు అందుకున్న సినిమాలు ఏవి? అనే విషయం మాత్రం ఎక్కడా లభించలేదు.
 
అలాగే 1954 లో జాతీయ అవార్డుల ప్రధానం చెయ్యకమునుపే కొన్ని భారతీయ సినిమాలు ప్రపంచంలోని ఇతరదేశాల్లో ప్రదర్శింపబడి పలు అవార్డులు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా 1936 లో నిర్మింపబడిన మరాఠీ చిత్రం ’సంత్ తుకారాం’ అనే భక్తి ప్రధాన చిత్రం వెనిస్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడడమే కాకుండా అక్కడ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. ఆ విధంగా అవార్డ్ పొందిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా ’సంత్ తుకారాం’ ని పేర్కొనవచ్చు. అలాగే 1946 లో కేతన్ ఆనంద్ రూపొందించిన ’నీచా నగర్’ అనే హిందీ చలన చిత్రం ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ పట్టణంలో జరిగిన మొట్టమొదటి చలనచిత్రోత్సవంలో పాల్గొనడమే కాకుండా అత్యుత్తమ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.
అలాగే 1946 లో కేతన్ ఆనంద్ రూపొందించిన ’నీచా నగర్’ అనే హిందీ చలన చిత్రం ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ పట్టణంలో జరిగిన మొట్టమొదటి చలనచిత్రోత్సవంలో పాల్గొనడమే కాకుండా అత్యుత్తమ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.
 
హయతుల్లా అన్సారీ రచించిన “నీచా నగర్” అనే కథ ఆధారంగా ఈ చలనచిత్రం రూపొందించబడింది. నిజానికి “నీచా నగర్” కథ మాక్సిమ్ గోర్కీ రచించిన “లోయర్ డెప్త్స్” అనే కథకు అనుకరణ. ఇదే కథ ఆధారంగా అంతకు ముందు ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు రెన్వాఆ తర్వాత ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురొసావా కూడా చలనచిత్రాల్ని నిర్మించారు. ఈ విధంగా మన దేశంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు మొట్టమొదటి సారిగా 1954 లో మొదలయినప్పటికీ మన దేశానికి చెందిన చిత్రాలు అప్పటికే కొన్ని విదేశీ పురస్కారాలు అందుకుని ఉన్నాయన్నమాట.
 
అలాగే మన తెలుగు చలనచిత్రమయిన “పాతాళ[[పాతాళ భైరవి”భైరవి]] భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రం గా గుర్తింపు పొందింది. ఇలాంటి ఖ్యాతి సాధించిన మరో తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి”[[మల్లీశ్వరి]]. ఈ సినిమా బీజింగ్‌లోబీజింగ్‌ లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై, 1953 మార్చి 14న చైనీస్‌ సబ్‌ టైటిల్స్‌ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదలయింది.ఈ విధంగా కొన్ని భారతీయ సినిమాలు అక్కడక్కడా గుర్తింపు పొందినప్పటికీ మొట్టమొదట ఉత్తమ చలనచిత్రాలకు పురస్కారాలు అందచేయాలనుకున్నది మాత్రం 1954 లోనే.
 
1953 లో మొట్టమొదటి సారిగా జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించాలనుకున్నప్పుడు రోజుల్లోకి వెళ్తే అప్పటికే మన దేశంలోని అన్ని భాషల్లో కలిపి దాదాపు 250 కి పైగా సినిమాలు నిర్మాణమయ్యేవి. అయితే ఈ 250 సినిమాల్లో కేవలం కొన్ని సినిమాలనే అత్యుత్తమైనవిగా ఎన్నుకోవాలంటే అంత సులభమైన విషయమేమీ కాదు. అందుకే అప్పటి జ్యూరీ సభ్యులకు భరతముని రచించిన “నాట్య శాస్త్రం” లోని సూత్రాలను పాఠించారని అప్పటి ప్రధానోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక చూస్తే తెలిసొస్తుంది.
1,84,735

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1147212" నుండి వెలికితీశారు