పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
[[బొమ్మ:parasurama.jpg|thumb|right|200px|పరశురామావతారము]]
[[శ్రీమహావిష్ణువు]] దశావతారములలో '''పరశురామావతారము''' (Parasurama Incarnation) ఆరవది<ref name="Shah">Shahjahanpur&nbsp;– Etihasik Evam Sanskritik Dharohar</ref>. [[చతుర్యుగములు|త్రేతాయుగము]] ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని '''భార్గవరాముడు''', '''జామదగ్ని''' అని కూడా అంటారు<ref name="Amar">{{cite book|last = Pai| first = Anant| authorlink = | coauthors = | title = Parashurama&nbsp;– Sixth Incarnation of Vishnu | publisher = Amar Chitra Katha&nbsp;– Volume 764 | date = November 29, 2010| location = | pages = 33| url = http://www.amazon.com/Parashurama-ebook/dp/B004EEORZW/| doi = | id = }}</ref>.
==పరశురాముని జన్మవృత్తాంతం==
కుశ వంశానికి చెందిన మహారాజు [[గాధి]]. ఒకసారి భృగు వంశానికి చెందిన [[ఋచీకుడు]] అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు<ref name="Parsh"/>. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు<ref name="yam">{{cite web|url = http://www.yamdagni.com/Parashurama.htm|title = Parashurama|accessdate = November 22, 2012|date = November 22, 2012|publisher = Rai, Kayarra Kinhanna}}</ref>. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు<ref name="Parsh"/>. [[గాధి]] కొడుకే [[విశ్వామిత్రుడు]]. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు [[శివుడు|శివుని]] వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర [[గొడ్డలి]]) పొంది, పరశురాముడైనాడు.
భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు [[శివుడు|శివుని]] వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర [[గొడ్డలి]]) పొంది, పరశురాముడైనాడు.
 
==కార్తవీర్యునితో వైరం==
[[File:Paraśurāma fighting King Kartavirya Arjuna..jpg|thumb|కార్త్యవీరునితో పోరాడుతున్న పరశురాముడు.]]
హైహయ వంశజుడైన [[కార్తవీర్యార్జునుడు]] శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు.<ref name="Parsh">{{cite book|last = Rai| first = Kayyara Kinhanna| authorlink = | coauthors = | title =BhargavaParashurama| publisher = Litent ePublishing | date = June 13, 2010| location = | pages = 33| url = http://www.amazon.com/Parashurama-ebook/dp/B003RWS7O4/| doi = | id = }}</ref>. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
 
కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
"https://te.wikipedia.org/wiki/పరశురాముడు" నుండి వెలికితీశారు