యాజ్ఞసేని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
యాజ్ఞసేని నవల ప్రముఖ ఒడియా రచయిత్రి, [[జ్ఞానపీఠ్ పురస్కారం|జ్ఞానపీఠ్ పురస్కార]] గ్రహీత [[ప్రతిభా రాయ్]] రాసిన ఒడియా నవలకు తెలుగు అనువాదం. ఈ నవల [[మహాభారతం|మహాభారతంలోని]] [[ద్రౌపది]] జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఇతివృత్తంగా చేసుకుని సాగుతుంది.
== రచన నేపథ్యం ==
ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ప్రతిభా రాయ్ ఒడియా భాషలో యాజ్ఞసేని నవలను 1984లో రచించారు. నవలను రచించేందుకు ముఖ్యకారణంగా రచయిత్రి కొన్ని వివరాలను తెలిపారు. రచయిత్రి స్నేహితురాలి చెల్లెలు కృష్ణ భర్త వల్ల వంచితురాలై విడాకులు తీసుకుని రెండో పెళ్ళి చేసుకుందనీ, ఆమెను నిందిస్తూ ఒకరు "పేరే కృష్ణ. రెండో పెళ్ళెందుకు చేసుకోదు. కృష్ణ(ద్రౌపది మరోపేరు) ఐదుగురిని వరించినా కృష్ణునివైపు, కర్ణునివైపు ఆకర్షితురాలైంది" అన్నారనీ ఆమె రాసుకున్నారు. మూల భారతాన్ని గానీ, సరళానువాదాలను గానీ చదవనే చదవకుండా ద్రౌపదినీ, సంస్కృతినీ అవమానించే ఇలాంటి వ్యాఖ్యల వల్ల దుఃఖం కలిగి ఈ నవల రచించానని ఆమె తెలిపారు. జయశ్రీ మోహనరాజ్ తెలుగులోకి యాజ్ఞసేని పేరుతోనే అనువదించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/యాజ్ఞసేని" నుండి వెలికితీశారు