తులసి: కూర్పుల మధ్య తేడాలు
చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| synonyms = ''ఓసిమం శాంక్టమ్'' [[కరోలస్ లిన్నయస్|లి.]]
'''తులసి''' ([[ఆంగ్లం]] Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, [[హిందూ మతము|హిందూ]] సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని [[శాస్త్రీయ నామము]] ''ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్'' (Ocimum tenuiflorum). ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని ''కృష్ణ తులసి'' అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని ''రామతులసి'' అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని [[పూజ]]కు వాడుతారు. [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. షోడశోపచార పూజా విద్ధానములో తులసికి విశిష్ట స్థానం ఉన్నది.నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు.
==తులసి ప్రాముఖ్యత==
హిందూ మతంలో, ప్రత్యేకించి [[శ్రీ వైష్ణవం|శ్రీ వైష్ణవ]] సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ [[పసుపు]] [[కుంకుమ]]లు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, [[వ్రతాలు]], [[పండుగలు]], [[స్తోత్రాలు]], [[భక్తి]] గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్ధం పోస్తారు. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది.ఆ వాయువును పీల్చుట వలన ' యజ ' చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది.కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి,వాతావరణ కాలుష్యాన్ని నివారించి,ఆరోగ్యాన్ని రక్షించుకొని,తులసి తీర్ధం సేవించండి.త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ వ్రతములకంటే మిన్నగా శరీరశుద్ధియగును.తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణికోటి పవిత్రులు,నిర్వికారులు కాగలరు.తులసి మొక్క వున్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వ దేవతలు నివసింతురు.తులసి దళములందు పుష్కరాది తీర్ధములు,గంగ మొదలగు నదులు,వాసుదేవది దేవతలు నివసింతురు.
[[దస్త్రం:Plant holy basil.jpg|250px|rightthumbnail]]
{{Unreferenced|"తులసి ప్రాముఖ్యత" అనబడే వ్యాస భాగము |date=అక్టోబరు 2007}}
Line 52 ⟶ 51:
==పురాణాలలో తులసి==
తులసిని గురించి హిందూమతంలో ఎన్నో కథలు, నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి.
గురించి దాని పవిత్రత గురించి బ్రహ్మవైవర్త పురాణంలో తులసి వరింపబడింది. [[పరశురాముడు]] తన గురువైన [[శివుడు|శివుడిని]] [[పార్వతి|దుర్గాదేవి]] [[గణపతి]]ని అన్ని పుష్పములతో అర్చించాడు కాని తులసితో అర్చించక పోయినా గణపతి ఆ పూజలు ఎందువలన స్వీకరించాడు అని నారదుడు నారాయణ మునిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వృత్తాంతాన్ని చెబుతారు. ఒక్కప్పుడు యవ్వనము నందున్న తులసి నారాయణుడిని మనసులో తలచుకొనుచు వెళ్ళుచుండగా [[గంగా]]నది తీరంలో చందనము రాసుకొని రత్నాలంకారములతో నారాయణుడి గురించి ధ్యానం చేసుకొనుచున్న గణపతి కనిపించెను. ఆయనను చూసి తులసి కామ పీడితురాలై గణపతితో వికారముగా గజముఖమును కలిగి లంబోదరముతో ఏకదంతము కలిగి నువ్వు ధ్యానం వదిలి పెట్టి బాహ్య ప్రపంచములోకి రమ్ము అని అంటుంది. దానికి సమాధానంగా, తల్లి శ్రీకృష్ణ పాదపంకజాలను స్మరిస్తున్న నన్ను ఏలా నా ధ్యానంను భంగము చేయుచున్నావు, నీ తండ్రి ఎవరు, నీకు ఏ విఘ్నాలు కలగకుండ ఉండుగాక నీ విషయాలు తెలుపుము అని అంటాడు. అప్పుడు తులసి తాను ధర్మద్వజుడు కుమార్తెనని భర్త కోసం తపం ఆచరిస్తున్నానని గణపతిని భర్తగా అవ్వమని కోరుకొంటుంది. అప్పుడు గణపతి వివాహానికి నిరాకరించి పెళ్ళి దుఃఖం కలిగించునని శ్రీహరి సాన్నిధ్యము నుండి వేరు చేయునని, మోక్షమార్గానికి కవాతం కాదని వారిస్తాడు. తులసి దానికి కోపించి గణపతిని ఈ విధంగా శపిస్తుంది "నీభార్య అందరివద్ద ఉండుగాక". ఈ శాపవచనమును విన్న గణపతి ప్రతిశాపంగా "నువ్వు రాక్షస జన్మ ఎత్తుతావు, శరీరాన్ని పరిత్యజించిన తరువాత వృక్షానివి అవ్వుతావు" అంటాడు. ఆ ప్రతిశాపం విన్న తులసి రోదించి గణపతిని స్తుతించింది , అది విని గణపతి ప్రసన్నుడై
<poem>
:పుష్పాణాం సార భూతాం త్వం భవిష్యసి మనోరమే
:కళాంశేన మహాభాగే స్వయం నారాయం ప్రియా
:ప్రియత్వం త్వరదేవానాం శ్రీకృష్ణస్య విశేశతః
:పూజా విముక్తిదా నౄణాం మయాభోగ్యాన నిత్యశః
:ఇత్యుక్త్వాతాం సురశ్ర్ష్ఠో జగామ తపసేపునః
:హరేరాధన నవ్యగ్రో బదరి సన్నిధింయయౌ
</poem>
పుష్పములన్నింటికి ప్రధానదానవు అవుతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణపరమాత్మకు]] ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి గణపతి బదరికా వనానికి వెళ్ళి పోతాడు. ఆ తరువాత తులసి శంఖచూడునకు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు [[శివుడు|శివుని]] చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందుతుంది. అందువల్ల గణపతి ప్రతి నిత్యం తులసితో పూజించరాదు.ఈ విషయాలు ధర్ముడు తనకు చెప్పెనని నారాయణ ముని [[నారదుడు|నారదునితో]] చెప్పడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది. తులాభారం శ్రీ కృష్ణ తులాభారం కథలో -[[సత్యభామ]] బారువులకొలది బంగారం వేసినా సరితూగని [[కృష్ణుడు]] [[రుక్మిణి]] ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడు. భగవంతుడు భక్తికి అందుతాడని ఈ గాధ సందేశం.
==ఆచారాలలో తులసి==
తులసికి సంబంధించిన ఆచారాలకు మౌలికమైన నమ్మకాలు:
Line 68 ⟶ 67:
* తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు.
* ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి.
[[కార్తీక శుక్ల ఏకాదశి]] నాటినుండి [[పౌర్ణమి]] వరకు తులసీ వివాహం ఉత్సవం జరుగుతుంది.
; ఇతర మతాలలో
* [[యేసు క్రీస్తు]]ను శిలువ వేసిన స్థలంలో తులసి పెరిగిందని ఒక కథ.
* [[షియా]] రచనలలో కూడా తులసి ప్రస్తావన ఉంది<ref>http://al-islam.org/jesus_shiite_narrations/16.htm</ref>.
తులసి భర్త పెరు జలంధరుడు
==తులసిని గురించిన సూక్తులు, ప్రార్ధనలు==
[[Image:Ocimum tenuiflorum.jpg|right|thumb|ఇంటి ప్రాంగణములో తులసికోట]]
Line 81 ⟶ 77:
* "తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది. తులసిని ప్రార్ధీంచడం వలన రోగములు నశిస్తాయి. తులసిని పూజించిన యమునిగూర్చి భయముండదు." - ''[[స్కంద పురాణం]] * "తులసి ఆకులు, పూలు శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతికరమైనవి." - ''[[భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకురా]]''
;తులసీ స్తోత్రం నుండి:
<porm>
: జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
: యతో బ్రహ్మాదయో దేవాః సృష్టి స్థిత్యంత కారిణీ
Line 98 ⟶ 93:
:తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
:నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే
</poem>
==దేవతగా తులసి==
[[బొమ్మ:Tulsidevi01.jpg|thumb|left|దేవతామూర్తి రూపములో పూజించబడుతున్న తులసి]]
Line 105 ⟶ 100:
గంధర్వతంత్రము ప్రకారం ఏకాగ్రత మరియు నిష్టతో ధాన్యము చేసుకోవటానికి మరియు పూజలు చేసుకోవటానికి అనుకూలమైన స్థలాల్లో, తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ప్రదేశాలు కూడా ఉన్నవి. అటువంటి ఆలయాలలో ఒకటైన [[వారణాసి]]లోని ''తులసీ మానస్ మందిర్'' లో ఇతర హిందూ దేవతలతో పాటు తులసి కూడా పూజలందుకొంటున్నది. వైష్ణవులు, విష్ణువుకు తులసి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా గౌరవించి నైవేద్యములో భాగముగా తులసి ఆకులను స్వీకరిస్తారు. వీళ్లు తులసి కాండముతో చేసిన పూసల దండలను ధరిస్తారు. తులసి దండల తయారీ, అనేక తీర్ధయాత్రా స్థలాల్లో [[కుటీర పరిశ్రమ]]గా కొనసాగుతున్నది. గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో తులసికి, బృందావన దేవత, బృందాదేవి లేదా వృందాదేవి అని కూడా మరోపేరు కలదు.
అమృతం మాదిరిగానే తులసి కూడా క్షీరసాగరాన్ని మధించే సందర్భంలో ఉద్భవించినదని మన పురాణాలు చెబుతాయి. అందుకే భారతీయ సంస్కృతిలో తులసికి పవిత్ర స్థానం, ప్రధాన స్థానం ఉంది. * తులసిని ప్రత్యక్ష దైవంగా హిందువులు పూజిస్తారు. మనుషులకు అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుందనే నమ్మకం ఉంది. * హిందువులే కాకుండా ఇతర ప్రాంతాల, దేశవాసులు కూడా తులసికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు హైషియన్ వర్తకులు తమ అంగళ్లలో దుష్టశక్తులు రాకుండా తులసి నీళ్లను జల్లుతారు. నవీన మెక్సికన్ గ్రామ ప్రాంతపు ప్రజలు తమ మనీపర్సుల్లో తులసి ఆకులను పెట్టుకుంటారు. ఇలాచేయడంవల్ల ధనలక్ష్మి కరుణిస్తుందని వారు నమ్ముతారు. మెక్సికన్ సంస్కృతిలో మహిళలు, తమ భర్తలు ఇతర మహిళల వెంట పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ రొమ్ముల మీద తులసి పొడిని జల్లుకోవటం ఆచారంగా ఉంది.
* సర్ జె.సి.బోస్ తను చేసిన వృక్షశాస్త్ర అధ్యయనాల్లో మొక్కలు కూడా మనుషుల మాదిరిగానే స్పందిస్తాయని సాక్ష్యాధారాలతో సహా రుజువుచేసారు. హిందూ సంస్కృతిలో మొక్కలను పవిత్రంగా, తోటి జీవకోటిగా గౌరవించటం ఆచారంగా ఉంది. ఇదే ఉద్దేశ్యంతోనే తులసిని పవిత్రంగా పూజిస్తారు. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఆయుర్వేద గ్రంథాలు అవసరం లేకుండా మొక్క భాగాలను పీకడం, తుంచటం వంటివి చేయవద్దని హితవు చెబుతాయి. * తులసికి సంస్కృతంలో చాలా పేర్లున్నాయి. సురస (మంచి రసం కలిగినది), సులభ (సులభంగా లభించేది), విష్ణువల్లభ (విష్ణుమూర్తికి ఇష్టమైనది), అపేతరాక్షసి (రాక్షస బాధను తొలగించే సామర్థ్యం కలిగినది), పావని (పవిత్ర చేసేది), శూలఘ్నీ (శూలను లేదా నొప్పిని తగ్గించేది)... ఈ పేర్లన్నీ తులసి గుణ ధర్మాలను స్పష్టం చేస్తాయి. * తులసి మొక్కలో ఆకులకు, వేర్లకు, గింజలకు ఔషధ తత్వాలు ఉన్నాయి. * తులసి స్వరసాన్ని 10-20మి.లీ. (2-4 టీ స్పూన్లు) మోతాదులోనూ, వేరు కషాయాన్ని 50-100 మి.లీ. (అర కప్పు- ఒక కప్పు) మోతాదులోనూ, చూర్ణాన్ని 3-6 (గ్రాముల (అర టీ స్పూన్- టీ స్పూన్) మోతాదులోనూ వాడాలి. గృహ చికిత్సలు ఆంత్రకృమి--తులసి ఆకులను, గింజలను ఎండబెట్టి, పొడిచేసి అర చెంచాడు మోతాదుగా చెంచాడు తేనెతో కలిపి తీసుకోవాలి. అజీర్ణం--తెల్ల తులసి వేరును, శొంఠిని నలగ్గొట్టి నీళ్లలో వేసి కషాయం కాచి తీసుకుంటే వెంటనే అజీర్ణం తగ్గుతుంది. గాయం, దెబ్బలు---గాయంమీద వాలిన ఈగలను, గాయం మీద పేరుకున్న ఈగల గుడ్లను తొలగించడానికి తులసి గింజలను, వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి లేపనం చేయాలి. వ్రణం--తులసి ఆకులు, ఉమ్మెత్తాకులు, నల్లతుమ్మ పట్ట... వీటిని దంచి నీళ్లలోవేసి కషాయం తయారుచేసి గాయాన్ని కడిగితే త్వరగా మానుతుంది. చెవి నొప్పి--తులసి గింజలతో తైలపాక విధానంలో తైలన్ని తయారుచేయాలి. (1 భాగం గింజల, 4 భాగాలు నువ్వుల నూనె, 16 భాగాలు నీళ్లు తీసుకొని కలిపి నీరంతా ఆవిరయ్యేవరకూ చిన్న మంటమీద మరిగిస్తే సిద్ధతైలం తయారవుతుంది) దీనిని కొద్దిగా వేడిచేసి చెవుల్లో డ్రాప్స్‌గా వేసుకుంటే చెవి నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. కంటి వ్యాధులు (కళ్లకలక)--తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి కళ్లకు అంజనంగా(కాటుకగా) వాడితే కళ్లకలక తగ్గుతుంది. దగ్గు--కృష్ణ తులసి ఆకుల రసాన్ని 2 చెంచాలు మోతాదులో చెంచాడు తేనెతో కలిపి తీసుకుంటే కఫంతోకూడిన దగ్గు తగ్గుతుంది. చలి జ్వరం (మలేరియా)--తులసి ఆకుల రసం నాలుగు టీస్పూన్లూ, మిరియం పొడి పావు చెంచాడూ కలిపి తీసుకుంటే చలి జ్వరం దిగుతుంది. తలలో విషం చేరితే--కృష్ణ తులసి గింజల పొడిని ముక్కుపొడుము మాదిరిగా పీల్చితే తలలో సంచితమైన విష పదార్థాల తీవ్రత తగ్గుతుంది. ప్రసవానంతర నొప్పులు (మక్కల్ల శూల)--తులసి ఆకుల రసాన్ని చెంచాడు మోతాదులో పాత బెల్లం, ద్రాక్షతో తయారైన మద్యంతో (ద్రాక్షాసవంతో) కలిపి తీసుకుంటే ప్రసవానంతరం ఇబ్బందిపెట్టే నొప్పి తగ్గుతుంది. పిల్లల్లో కనిపించే దగ్గు, జలుబులు---తులసి ఆకులు, లవంగ మొగ్గలు, పొంగించిన వెలిగారం (టంకణం/ బొరాక్స్/ బోరిక్ పౌడర్)... వీటిని మూడింటిని సమసమ భాగాలు తీసుకొని మెత్తగా నూరి పావుచెంచాడు మోతాదులో ఇస్తే చిన్న పిల్లలకు వచ్చే జ్వరం, దగ్గు, ఉబ్బసం, కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి. దద్దుర్లు--తులసి ఆకుల రసాన్ని స్థానికంగా ప్రయోగిస్తే దద్దుర్లు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి--ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తులసి ఎడాప్టోజెన్‌గాను, యాంటీస్ట్రెస్‌గా పనిచేస్తుందని తేలింది. ప్రతినిత్యం ఉదయసాయంకాలాలు 10 తులసీ దళాలను నమిలి తింటుంటే మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. కాలేయ సమస్యలు--10-15 తులసి ఆకులను వేడి నీళ్లలో కడిగి ప్రతిరోజూ ఉదయం పూట తిని ఒక గ్లాసు వేడినీళ్లు తాగితే కాలేయం సమస్యల్లో హితకరంగా ఉంటుంది. చర్మవ్యాధులు--చర్మవ్యాధులు మొండిగా మారిపోయి ఇబ్బంది పెడుతున్నప్పుడు తులసి ఆకులను దంచి రసం పిండి 2-4 టీ స్పూన్ల మోతాదులో ప్రతినిత్యం ఉదయం పూట తీసుకోవాలి. దద్దుర్లు, గౌట్ నొప్పి--తులసి ఆకులను నిమ్మ రసంతో సహా నూరి దద్దుర్లు, గౌట్ వ్యాధివల్ల వచ్చే నొప్పి, చర్మవ్యాధి వంటి వాటిమీద బాహ్యంగా ప్రయోగిస్తే లాభప్రదంగా ఉంటుంది.
Line 144 ⟶ 137:
;ఇతరాలు
*[http://www.allayurveda.com/herb_month_march2004.htm ఈ నెల వనమూలిక, మార్చి 2004 (ఆయుర్వేద)]
[[వర్గం:లామియేసి]]
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు