లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

19,295 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
 
'''కుటుంబీకుల సేవ''' : కన్యకు పెళ్ళి పూర్తికావడంతో ఓ ఇంటి కోడలవుతుంది. అత్తమామలకు ప్రతిరోజూ సాయంత్రం వేడినీళ్ళతో స్నానం చేయించాలి. అన్న పానాదులు క్రమ పద్ధతిలో అందునట్లు జాగ్రత్తపడాలి. రాత్రి సమయంలో అత్తమామలకు కాళ్ళు నొక్కడం వీరి ఆచారము.
తీజ్
బొరాయీ తీజ్
 
తొమ్మిది రోజుల సంబురాలు... కఠోర నియమాలు.. డప్పుల మోతలు... తండంతా కేరింతలు... పెళ్లికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నాచెప్లూళ్ల... అక్కాతమ్ముళ్ల అనుబంధాలు... బావమరదళ్ల అల్లరిచేష్టలు... ఆ పై భక్తి భావం... వీటన్నింటి మేళవింపే తీజ్ పండుగ...
 
photo
తెలంగాణలోని ప్రతి గిరిజన తండా తీజ్ పండుగతో కళకళలాడుతున్నది. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయంగా ఈ తీజ్ పండుగను లంబాడీలు ఘనంగా జరుపుతారు. ఈ పండుగ బతుకమ్మను పోలి ఉంటుంది. తీజ్‌ను ఎనిమిది రోజుల పాటు పూజించి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాలను తండాలోని పెళ్లికాని ఆడపిల్లలే నిర్వహిస్తారు. వీరికి తండాపెద్దలు, సోదరులు సహకరిస్తారు. వర్షాకాలం ప్రారంభంలో కనిపించే ఎర్రని ఆరుద్ర పురుగును ‘తీజ్’ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా ‘తీజ్’గా పిలుస్తారు. బతుకమ్మను పూలతో అలంకరించినట్లే.. తీజ్‌లో గోధుమ మొలకలను పూజించడం లంబాడీల ఆనవాయితీ.
 
‘మారో బాపూ బజరజ్ హూంసియో కనాయియో’
‘ఓరి భేటీవూన తీజ్ బొరాదూ కేరోయే’
పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలకు పెండ్లి అయితే వచ్చే ఏడాదికి ఇంట్లో ఉండరనే ఉద్దేశంతో తల్లిదంవూడులు తీజ్ ఉత్సవాలను నిర్వహిస్తారు. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలు తల్లిదంవూడులు, తమకంటే వయస్సులో పెద్దవాళ్ల ఆశీస్సులను తీసుకుంటారు. వర్షాకాలం ప్రారంభమై నాటు పూర్తయిన తర్వాత ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. సీత్లాభవాని(లంబాడీల దేవత) పూజ ముగిసిన తర్వాత తీజ్‌ను జరుపుతారు.
 
‘నాయక్ బాపూ బొరాయో తీజ్, బాయీరో పాలేణా!
నాయెక్ బాపుతి రాజీయేగి తీజ్, బాయీరో పాలేణా’!
ఆడపిల్లలంతా కలిసి ఇల్లిల్లు తిరిగి పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఉత్సవాలు నిర్వహించడానికి అనుమతి కోసం ‘నాయక్’ దగ్గరికి వెళ్తారు. తండాకు పెద్ద మనిషి ‘నాయక్’ కాబట్టి, తండాలో ఎలాంటి శుభకార్యం జరిగినా ఆయన అనుమతి తప్పనిసరి. ఇది గిరిజన తండా కట్టుబాటు. అనుమతి పొందిన తర్వాత ఏర్పాటు పనులను మొదలు పెడతారు. ఆడపిల్లలందరూ కలిసి ఇంటింటికీ తిరిగి వేడుకల కోసం విరాళాలు సేకరిస్తారు.
 
‘ఘేవూలారయే తోన శారేతీ మంగాయీ’
ఘేవూలారయేతోన టపారే మా గోకి’
ఆ విరాళాలతో వారంలో ఒక రోజు అంగడికి వెళ్తారు. ఉత్సవాలకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతరత్రా సామాన్లను తెచ్చుకుంటారు. సాయంవూతానికి గోధుమలను నానబెట్టి, తీజ్‌లను మొలకెత్తించడానికి ఆడపిల్లలు, వారి సోదరులు బుట్ట(ఓల్డి)లను అల్లుతారు. ఇందుకోసం అడవిలో దొరికే దుసేరు తీగ (పిలోణీర్ వేళ్లీ)ను వాడుతారు. గోధుమలను నానబెట్టే క్రమం అత్యంత పవివూతంగా ఉండాలి. పుట్టమట్టిని తెచ్చి అందులో మేక ఎరువును కలుపుతారు. లంబాడీల దేవతలు దండియాడి(తొళ్జా భవాని), సేవాభాయా, సీత్లాభవాని పేర్లతో ‘దుసేరు తీగ’తో తయారు చేసిన బుట్టలో మొదటగా తండా నాయకుని చేత ఎరువు కలిపిన మట్టిని పోయిస్తారు. ఆ తర్వాత నానబెట్టిన గోధుమలు చల్లిస్తారు. ఈ తీజ్ ఉత్సవంలో దేవుని కోసం చేసే ప్రతికార్యం పాటతోనే సాగుతుంది.
 
‘శీత్లా యాడీ బొరాయీ తీజ్, బాయీ తారో పాలేణా,
సోనేరో డాక్ళో ఘలాన, బాయీ తారో పాలేణా’
తండాలోని ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క తీజ్ బుట్టను పెడతారు. ఆ బుట్టలన్నీ ఒకేచోట ఉండేందుకు పందిరిని ఏర్పాటు చేస్తారు. ఆ పందిరిని వర్ణిస్తూ ఆడపిల్లలందరూ పాట అందుకుంటారు. ఒక్కొక్క ఆడపిల్ల తన బుట్టను గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆ బుట్టలపై నీళ్లుపోయాల్సి ఉంటుంది. రోజంతా ఏ పనుల్లో ఉన్నా ఆ సమయానికి ఖచ్చితంగా తీజ్‌కు నీళ్లు పోయాల్సిందే!
 
బోరడి ఝష్కేరో ...
బోరఢి ఝష్కేరో కార్యక్షికమం తీజ్ పండుగలోనే ఒక ప్రత్యేక ఘట్టం. ‘బోరడి’ అంటే రేగుముళ్లనీ, ‘ఝష్కేరో’ అంటే గుచ్చడమని అర్థం. నానబెట్టిన రేగుముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని ఈ పేరుతో పిలుస్తారు. గోధుమలను బుట్టల్లో చల్లేరోజు సాయంత్రం బోరడి ఝష్కేరోని నిర్వహిస్తారు. ఇది పూర్తి వినోదభరితం. పెళ్లికాని ఆడపిల్లలు రేగుముళ్లకు శనగలు గుచ్చేటప్పుడు తమకు బావ వరుసవారు ముళ్లను కదిలిస్తారు. అయినా సహనంతో ఆడపిల్లలు శనగల్ని ముళ్లకు గుచ్చాల్సిందే. చెల్లెల్ని ఏడిపించే అన్నల్ని కూడా ఈ కార్యక్షికమంలో చూడవచ్చు.
 
‘ఖొద ఖొదారే సేవభాయకువలో ఖోద
కువలేరో పాణి అకెలాబి భరే, సకేలాభీ భరే’
బంజార లంబాడీలు సేవాభాయాను తమ దైవంగా భావిస్తారు. తమ నీటి కష్టాలను తీర్చడానికి సేవాభాయా బావిని లోతుగా తవ్వించాడని బంజారాలు భావిస్తూ తీజ్ కోసం నీళ్లను తెచ్చే సందర్భంలో ఆడపిల్లలు సేవాభాయాను పాటలో స్మరించుకుంటారు. సేవాభాయా తవ్వించిన బావి నుంచే నీళ్లను తెచ్చి తీజ్‌పై చల్లుతున్నట్లుగా భావిస్తారు.
 
‘లాంబీ లాంబీయే లాంబడి ఎకేరియా
లార లేరియే లాంబడి ఎకేరియా’
గోధుమలు, శనగలు మొలకెత్తి గునుగుపూలలా పొడుగ్గా పెరిగి వంగాలని ఆకాంక్షిస్తారు. ఇలా పెరిగితేనే నచ్చిన జీవిత భాగస్వామి దొరుకుతాడని, తమ బతుకులు పచ్చగా ఉండి, తండా బాగుపడుతుందని వారి నమ్మకం. మంచిగా కాలమై పంటలు బాగా పండుతాయని తండా పెద్దలు భావిస్తారు.
 
ఢమోళి...
ఇక ఏడో రోజు జరిపే కార్యక్షికమమే ‘ఢమోళి’. ‘చుర్మో’(రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానికి సమర్పించే కార్యక్షికమాన్నే ఢమోళి అంటారు. ఈ రోజు మేరామా భవానికి బలి ఇవ్వడం ఆచారం. వెండితో చేసిన మేరామా భవాని విగ్రహం కానీ, రూపాయి బిళ్ల కాని ముందుంచి మేకపోతును బలి ఇస్తారు. దీన్నే ‘అకాడో’ అంటారు. ప్రతి ఇంటి నుంచి పావుసేరు చొప్పున బియ్యం సేకరించి పాయసం (కడావో) వండుతారు. వండిన పాయాసాన్ని బలిగా ఇచ్చిన మేక మాంసాన్ని ఇంటింటికి పంపిస్తారు. ఆ రోజు తీజ్ వద్ద ఆటపాటలతో తండావాసులంతా ఆనందంగా గడుపుతారు.
 
కొంచెం దుఃఖం... కొంచెం ఆనందం
ఎనిమిదో రోజు తమ బంజారా ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. వారికి పెండ్లి చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రి) ప్రతిరూపాలను మట్టితో చేసి ఆరాధిస్తారు. పెండ్లి కాని ఆడపిల్లలు తమను డోక్రీలుగా ఊహించుకుంటారు. పెండ్లి అయితే తమ పుట్టింటిని వదిలి వెళ్లాల్సి వస్తుందని దుఃఖంతో ఏడుస్తారు. వారిని ఓదార్చుతూ సోదరులు, ఆటపట్టిస్తూ బావ వరుసవారు ఇలా... కొంచెం దుఃఖం, కొంచెం ఆనందంతో కొనసాగుతుంది.
 
ఘెవులారే తాతీ వడలి వేరాదూ...
తొమ్మిదవ రోజును బంజారాలు ఘనంగా జరుపుకుంటారు. తీజ్ నిమజ్జనానికి బంధుమివూతులందరినీ ఆహ్వానిస్తారు. కొత్తబట్టలు వేసుకుని అత్యంత పవివూతంగా మేరమా భవాని, సేవాభాయాకు భక్తిక్షిశద్ధలతో పూజలు చేస్తారు. డప్పుచప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిక్షిశద్ధలతో ఆడబిడ్డలు పెంచిన తీజ్‌ను తండా నాయక్ పరిశీలించి ఒక్కొక్క బుట్టను ఆడపిల్లలకు అందిస్తారు. మొదటి తీజ్(గోధుమ నారు)ను నాయక్ రుమాలులో పెట్టిన తర్వాత, ఆపదల నుంచి రక్షించాలని ఆడపిల్లలు తమ అన్నదమ్ములకు నారు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు.(ఇది రాఖీ పండుగను పోలి ఉంటుంది) ఈ నారు అత్యంత పవివూతమైందని, దీని వల్ల శుభం జరుగుతుందని నమ్మకం. తీజ్ బుట్టలను పట్టుకొని వరుసగా ఆడపిల్లలు నిమజ్జనానికి డప్పుచప్పుళ్లతో బయలుదేరుతారు. నృత్యాలు.. పాటలు.. కేరింతలతో ఆనందభరితంగా ఈ నిమజ్జన వేడుక సాగుతుంది. చెరువు దగ్గర తీజ్ నిమజ్జనం ఓ అద్భుతమైన సన్నివేశం. తీజ్ తమను వదిలేసి వెళ్లిపోతుందనే దుఃఖంతో ఆడపిల్లలు ఏడుస్తుంటే పెద్దలు, సోదరులు వారిని ఊరడిస్తుంటారు. జీవితాంతం నీకు నీడగా ఉంటూ రక్షిస్తానని చెల్లెల్ని పీటపై నిల్చొపెట్టి కాళ్లను కడిగి పాదాభివందనం చేస్తాడు అన్నయ్య. ఆ తర్వాత తీజ్‌ను చెరువులో నిమజ్జనం చేస్తారు.
 
నియమనిష్టలు..
బంజారాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరుపుకునే ఈ తీజ్ ఉత్సవం తొమ్మిది రోజులు అమ్మాయిలకు అగ్నిపరీక్షే. ఉప్పుకారం లేని భోజనం తినాలి. అత్యంత పవివూతంగా ఉండాలి. స్నానమాచరించి భక్తిక్షిశద్ధలతో తమ దేవతలను పూజించాలి. తండా నుంచి బయటికి వెళ్లకూడదు. మాంసాహారాలు తినకూడదు. బావి నుంచి నీటిని తెచ్చే బిందెను ఎక్కడా కూడా నేలపై పెట్టకూడదు. నేరుగా పందిరిపై పోయాల్సిందే. నీటిని తెచ్చే క్రమంలో డప్పుచప్పుడు చేస్తూ నృత్యాలు చేస్తారు. నృత్యం చేసినంతసేపూ బిందెను నెత్తిపై పెట్టుకొని నిలబడాల్సిందే!
 
గుర్తింపు కావాలి...
 
మాకు ప్రత్యేకమైన భాష, ఆచారం, సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా మా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ మా సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం నుంచి గుర్తింపు రావడం లేదు. తీజ్ పండుగ నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేకమైన తేది అంటూ ఏమీ లేదు. ఆగస్టు నెల రెండవ వారం నుంచి ఆగస్టు నెల చివరి వరకు వివిధ జిల్లాలోని లంబాడీలు ఒక్కొక్క రోజున జరుపుకుంటారు. బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే సీత్లాభవాని (దాటుడు), తీజ్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఒక తేదీని కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రంలోనైనా లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను గుర్తిస్తారని ఆశిస్తున్నాం.
 
==మా [[తండా]] ల్లో మారాజ్యం==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1152563" నుండి వెలికితీశారు