కాజోల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
'''కాజోల్ ''' ఒక భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించింది. [[షారుక్ ఖాన్]] మరియు కాజోల్ జోడీ [[బాలీవుడ్]] లో హిట్ పెయిర్ గా ఖ్యాతిచెందింది.
==నేపధ్యము==
ఈవిడ తల్లి [[తనూజ]]. ప్రముఖ నటి. తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన దర్శకనిర్మాత. ఇద్దరూ కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే కావడంతో... చిన్నప్పట్నుంచీ చుట్టూ సినిమా వాతావరణమే. కానీ తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటంతో ముంబైలోని పాంచ్‌గనిలో సెంట్ జోసెఫ్ కాన్వెంట్ బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. క్లాస్‌లో హెడ్‌గాళ్. చదువు కంటే ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి. డ్యాన్స్ నేర్చుకొంది. ఫిక్షన్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకొంది. అవే జీవితంలో ఎదిగేందుకు దోహదపడ్డాయని చెబుతుంటుంది. ఫిక్షన్ నవలలు చదవడం వల్ల కష్టాల్ని అలవోకగా అధిగమించానని చెబుతుంటుంది.
 
కాజోల్ తల్లిదండ్రులు మాత్రమే కాదు, వారి కుటుంబమంతా సినిమా పరిశ్రమలోనే ఉంది. [[నూతన్]], శోభన్ సమర్థ్, రతన్ బాయి, [[జాయ్‌ముఖర్జీ]], దేవ్‌ముఖర్జీ, శశిధర్ ముఖర్జీ... ఇలా కాజోల్ బంధువులంతా సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. కాజోల్ కజిన్స్ కూడా సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. [[రాణీముఖర్జీ]], షర్వాణీ ముఖర్జీ, మోనిష్ భెల్, దర్శకుడు అయాన్‌ముఖర్జీ... ఇలా అందరూ కూడా పరిశ్రమలో రాణిస్తున్నారు. కాజోల్‌కి స్వయానా ఓ చెల్లి ఉంది. ఆమె పేరు [[తనీషా]]. తెలుగులోనూ నటించింది.
 
==సినీరంగ ప్రవేశము==
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/కాజోల్" నుండి వెలికితీశారు