కాజోల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
1994లో 'ఉదార్ మే జిందగీ' అనే చిత్రంలో జితేంద్రకి మనవరాలిగా నటించింది. ఈ చిత్రం తెలుగులో విజయవంతమైన '[[సీతారామయ్యగారి మనవరాలు]]'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఆదరణకు మాత్రం నోచుకోలేదు. ఆ వెంటనే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో 'యే దిల్లగీ' చేసింది. [[అక్షయ్‌కుమార్]], [[సైఫ్ అలీఖాన్]] సరసన నటించింది. 1995లో 'కరణ్ అర్జున్', '[[దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే']] చిత్రాలు చేశాక ఇక కాజోల్‌కి వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. ఆ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో కాజోల్ పేరు మార్మోగిపోయింది.
 
ప్రేమకథలకీ, కుటుంబ కథా చిత్రాలకే పరిమితమైపోతోంది. ఇతరత్రా కథలకు ఆమె న్యాయం చేయలేదేమో అనుకొంటున్న దశలోనే... కాజోల్ కీలకమైన నిర్ణయాలు తీసుకొంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలవైపు అడుగులేసింది. అందులో భాగంగా 'గుప్త్'లో నటించింది. ఆ చిత్రంలో వ్యతిరేక ఛాయలున్న పాత్ర పోషించింది. నటిగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత మళ్లీ తనదైన శైలిలో అడుగులేస్తూ 'ప్యార్ కియా తో డర్నా క్యా', 'ప్యార్ తో హోనా హై తా', 'కుచ్ కుచ్ హోతా హై'లాంటి సినిమాలు చేసింది. మధ్యలో 'దుష్మన్' కూడా చేసింది. అందులో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకొంది.
అటు నటన, ఇటు అందం... రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. వైవిధ్యమైన కథల్ని ఎంచుకొంటూ విజయాల్ని సొంతం చేసుకొంది. '[[కుచ్ కుచ్ హోతా హై]]' తర్వాత ఆమెకి సరైన సినిమాలు పడలేదు. 'కభీ ఖుషీ కభీ ఘమ్'తో మళ్లీ పుంజుకొంది. ఆ తర్వాత 'కల్ హో న హో', 'ఫనా', 'కభీ అల్విద న కెహనా', 'యు మి ఔర్ హమ్', 'రబ్ నే బనాదీ జోడీ', 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రాలు మళ్లీ మునుపటి కాజోల్‌ని గుర్తుకు తెచ్చాయి. వివాహానంతరం మధ్యలో ఆచితూచి సినిమాలు చేసింది. మంచి కథ దొరికినప్పుడు మాత్రం వదిలిపెట్టలేదు.
 
==వ్యక్తిగత జీవితము==
"https://te.wikipedia.org/wiki/కాజోల్" నుండి వెలికితీశారు