రైల్వే కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
వైఎస్ఆర్ జిల్లాలో '''కోడూరు''' పేరుతో రెండు మండలాలు ఉన్నాయి.అయోమయ నివృత్తి కొరకు, ఒకటి [[బద్వేలు]] సమీపములో ఉన్నందును దానిని [[బి.కోడూరు]] గాను, ఇంకో ప్రాంతములో రైల్వే సౌకర్యం ఉన్నందున '''రైల్వే కోడూరు''' గానూ పిలుస్తారు. ఈ ప్రాంతము మామిడి పంటకు ప్రసిద్ది గాంచినది. రైల్వే సౌకర్యం కూడ ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున మామిడి క్రయ విక్రయాలు జరుగుతాయి. స్వతంత్రమునకు పూర్వము ఈ గ్రామంలో కడప జిల్లాలోనే మొదటిసారిగా రైలు బండి ఆగడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గ్రామం పేరును '''కోడూరు ''' నుండి '''రైల్వే కోడూరు ''' గా మార్చారు. ఈ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో [[తిరుపతి]] మరియు 100 కిలోమీటర్ల దూరంలో [[చెన్నై]] ఉండటంతో మంచి వ్యాపారకేంద్రంగా విరాజిల్లుతోంది.
 
= = దేవాలయాలు = =
#గుండాలకోన క్షేత్రం;- మండలంలోని గుండాలకోన క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. భక్తుల సౌకర్యంకోసం వై.కోట నుండి ప్రత్యేకంగా బస్సులు నడుపుతారు. [2]
#రైల్వే కోడూరులో ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి (ఉగాది ముందురోజు) రోజున సాయంత్రం, పార్వతీసమేత పరమేశ్వరుడు, చంద్రప్రభ వాహనంపై పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చును. ఈ కార్యక్రమం కోసం ఆలయకమిటీవారు పుష్పరథం ఏర్పాటుచేసెదరు. ఆదిదంపతులకు గ్రామస్థులు, నీరాజనాలు సమర్పించెదరు. [3]
#శ్రీ బలిజ గంగమ్మ అమ్మవారి ఆలయం:- పట్టణ పరిధిలోని బలిజవీధిలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జాతర, 2014,మే-22, గురువారం నాడు ఘనంగా నిర్వహించినారు. జిల్లా నుండి భక్తులు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. [5]
 
= = గ్రామ పంచాయతీ = =
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తిప్పన కృష్ణయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. <ref>ఈనాడు కడప; జనవరి-7,2014; 5వ పేజీ.</ref>
 
= = విశేషాలు = =
* మండల పరిధిలోని పారపరాచపల్లెకు వెళ్ళే దారిలో 400 సంవత్సరాల వయసు కలిగిన ఒక మర్రిచెట్టు ఉన్నది. చెట్టు చుట్టూ 50 అడుగుల వరకూ ఊడలు విస్తరించి ఉండటంతో, చూపరులకు ఆసక్తి కలిగించుచున్నది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, ఈ వృక్షం వద్ద గల అక్కదేవతలకు పూజలు నిర్వహించుచుంటారు. ఈ వృక్షం ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉండటంతో, పరిసర గ్రామాలవారు దేవతలకు పూజచేయడం ఆనవాయితీగా వస్తున్నదని గ్రామస్థులు అంటుంటారు. [4]
"https://te.wikipedia.org/wiki/రైల్వే_కోడూరు" నుండి వెలికితీశారు