రఘుబాబు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
ఆరో తరగతి పూర్తయ్యాక ఆయన్ను కూడా మద్రాస్‌ తీసుకెళ్లారు. అప్పట్లో అక్కడ పదోతరగతి దాకా తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలు ఉండేవి. దాంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి మాత్రం ఇంగ్లిష్‌తో ఇబ్బందిపడ్డాడు. ఇంటర్‌ అయిపోయాక ఇంజినీరింగ్‌లో చేరాడు. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో ఉండగా గిరిబాబు సొంతంగా సినిమా తీశాడు. డబ్బు వ్యవహారాలు చూసుకోవడానికి మొదట్లో రఘుబాబు కూడా షూటింగ్‌కి వెళ్లేవాడు. అలాఅలా చదువు పూర్తిగా మానేసి సినిమాలోకంలో పడ్డాడు.
==నటానట జీవితం==
గిరిబాబు నటుడే అయినప్పటికీ పిల్లల్ని సినిమాలకు దూరంగా ఉంచేవాడు. ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది కాదు. మామూలు మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందో అలాగే ఉండేది. కాబట్టి నటించాలన్న ఆలోచన మొదట్నుంచి లేదు. ప్రొడక్షన్‌ పనులు చూసుకోవడానికి ఫీల్డులోకి వచ్చాడు. కాబట్టి ఎప్పటికైనా నిర్మాత అయి మంచి సినిమాలు తీయాలన్న కోరిక బాగా ఉండేది.
 
పంక్తి 48:
 
పారంభంలో ఎక్కువగా నెగెటివ్ పాత్రలే వచ్చాయి. గుర్తుండిపోయేది మాత్రం '[[ఆది]]'లో న చేసిన గంగిరెడ్డి పాత్ర. దానికి తిరుగులేని పేరొచ్చింది. బాస్ ఏమన్నా గంగిరెద్దులా తలాడించే ఫాక్షనిస్ట్‌ పాత్ర . 'కుర్రాడు ఎలా ఉన్నాడ్రా' అని బాస్ నన్ను అడిగితే 'మాంచి బళ్ళెంలా ఉన్నాడన్నా' అంటుంటాడు . ఇక ఆ తరవాత వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
 
తర్వాత మళ్లీ వినాయక్‌గారు పిలిచారు. '[[చెన్నకేశవరెడ్డి]]'లో నెగిటీవ్ టచ్ ఉన్న పాత్ర. నందమూరి బాలకృష్ణగారు సెట్లో చాలా ప్రోత్సహించేవారు. ప్రతీ దానికీ 'లాబరన్న...' అంటుంటాడు. ఈ మాట మాస్‌లోకి దూసుకుపోయింది. దాని తర్వాత 'అడిగోరా...లాబరన్న' అని అవుట్‌డోర్‌లో ఇతడిని చూసిన జనం కేకేసేవారు. ఏ నటుడుకైనా సరే ఇలాంటి ఆదరణే కావాలి. దాంతో ఇతని పేరు, ఫేసూ ముద్రించుకుపోయాయి''
 
ఈతరం బాబూరావుగారి 'యజ్ఞం' సినిమాలోనూ ఫాక్షనిస్ట్‌ పాత్రే. కాకపోతే తర్వాత నిజాలు తెలుసుకుని మంచోడిగా మారతాడు. చివరికి చనిపోతాడు. దాంతో ప్రేక్షకుల్లో ఈ పాత్రపై సింపతీ పెరిగింది. ఎక్కువగా ఫ్యాక్షనిస్టు పాత్రలే వేసినా వేటికవి వేర్వేరు.
 
'కబడ్డీ కబడ్డీ' కూతతో ఇతని నట ప్రయాణం కామెడీ వైపుకి మళ్లింది. అందులో టీ అమ్ముతుంటాడు. 'కప్పు టీ...కప్పు టీ' అని అరుస్తుంటాడు. ఈ సినిమాలో కామెడీ గ్యాంగ్ చాలా ఉంది. అందులో ఇతనికీ కావల్సినంత పేరొచ్చింది''
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/రఘుబాబు" నుండి వెలికితీశారు