తెలంగాణా సాయుధ పోరాటం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తెలంగాణా సాయుధ పోరాటం''' 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ [[నిజాం]] నవాబు [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.[[మఖ్దుం మొహియుద్దీన్‌]] సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని [[రాజబహదూర్‌ గౌర్‌]] ప్రకటించారు.[[ఖాసిం రజ్వీ]] నేతృత్వంలోని రజాకార్లు, దేశ్ ముఖ్ లు, జమీందారులు, దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు. ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది. రజాకార్‌ సైన్యాన్ని ప్రజాసైన్యంగా అభివర్ణించిన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు.<ref>[[సంగిశెట్టి శ్రీనివాస్]] తెలంగాణ హిస్టరీ సొసైటీ
సాక్షి దినపత్రిక,తేది 3-10-2010</ref>
 
==నేపథ్యం==
తెలంగాణ సాయుధ పోరాటానికి మూలాలు నిజాం నిరంకుశ పాలనలో ఉందని చారిత్రికులు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజ్యంలో పాలకుడు ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ స్థాయి నుంచి గ్రామాల్లోని దొరల వరకూ సాగిన అణచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం మొలకెత్తింది. వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణపై తీవ్ర ఆంక్షలు, మాతృభాషలపై అణచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు వంటి ఎన్నో పరిణామాలు నేపథ్యంగా నిలిచాయి.
 
=== వెట్టి చాకిరి సమస్య ===
గ్రామాలపై పెత్తనం వహించే దొరలకు, గ్రామాధికారులకు గ్రామాల్లోని వివిధ వృత్తులవారు వెట్టి చాకిరీ చేసే పరిస్థితులు నిజాం పాలన కాలంలో నెలకొన్నాయి. దొర ఇళ్లలో జరిగే వివిధ వేడుకలకు, శుభకార్యాలకు గ్రామంలోని అణచివేయబడ్డ కులాల వారి నుంచి మొదలుకొని వ్యాపారస్తులైన కోమట్ల వరకూ ఉచితంగా పనిచేయవలసి రావడం, డబ్బుతో పనిలేకుండా సంభారాలు సమకూర్చడం వంటివి జరిగేవి. గ్రామంలోకి పై అధికారులు వచ్చినప్పుడు జరిగే విందు వినోదాలకు ధాన్యం, మాంసం, కాయగూరలు వంటివి ఇవ్వడానికి ఊరందరికీ బాధ్యతలు పంచేవారు. వంట పని, వడ్డన పని మొదలుకొని అన్ని పనులూ పంచబడేవి. ఇదే కాక నిత్యం దళిత కులాలకు చెందిన వెట్టివారు అధికారులు, దొరల ఇళ్ళలో వెట్టిపని చేసి దయనీయంగా జీవితాన్ని గడపవలసి వచ్చేది. తెలంగాణా సాయుధ పోరాటం ప్రారంభమయ్యాకా ప్రజలను ఉత్తేజపరిచే పోరాటగీతాల్లో కూడా విరివిగా వెట్టిచాకిరీ సమస్య చోటుచేసుకుంది.
Line 16 ⟶ 18:
== తొలిదశ ==
1921 నవంబర్ 12న హైదరాబాద్‌లోని టేక్‌మాల్ రంగారావు ఇంట్లో తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకునే లక్ష్యంతో [[ఆంధ్ర జనసంఘం]] ఏర్పాటుచేశారు. [[మాడపాటి హనుమంతరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[ముందుముల నరసింగరావు]], [[ఆదిరాజు వీరభద్రరావు]], [[రామస్వామి నాయుడు]], [[టేక్‌మాల్ రంగారావు]] తదితర 11మంది యువకులతో ఆ సంఘం ఏర్పాటైంది. తెలుగు భాష వ్యాప్తికి ప్రచారం చేస్తూ క్రమక్రమంగా నిజాం పాలనలో ప్రజలపై అమలవుతున్న ఆంక్షలను వ్యతిరేకించడం ప్రారంభించింది. వెట్టిచాకిరీ నిర్మూలన వంటి సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం వంటివి ప్రారంభించింది. ఆ సంస్థ 1930కల్లా [[ఆంధ్రమహాసభ|ఆంధ్రమహాసభగా]] రూపుదిద్దుకుంది.<ref>బండెనక బండికట్టి:వాసిరెడ్డి నవీన్:తెలుగు వెలుగు పత్రిక:సెప్టెంబర్ 2012</ref>
 
=== ఆంధ్రమహాసభ ===
 
=== ఆర్య సమాజ్ ===
 
== రెండవ దశ ==
 
=== [[దొడ్డి కొమరయ్య]] మరణం ===
 
=== సాయుధ పోరాటం ===
Line 39 ⟶ 44:
==పోరాట ఫలితం==
కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1949 లో హైదరాబాదు రాష్ట్రం భారత దేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్‌ రాజ్యంలో [[బూర్గుల రామకృష్ణారావు]] నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
 
== పోరాట సాహిత్యం ==
=== కవిత్వం ===