ధూమపానం: కూర్పుల మధ్య తేడాలు

6,022 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి (తెలుగులో దారిమార్పు, Replaced: #REDIRECT → #దారిమార్పు,)
'''పొగ త్రాగడం ''' లేదా '''ధూమ పానం ''' అనగా పొగాకు సేవించే అలవాటు. ఇది మిక్కిలి ప్రమాదకరమైనది.
#దారిమార్పు [[పొగ చుట్ట]]
 
== అనర్ధాలు==
పొగాకు అలవాటు కారణంగా ప్రతి 8 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. ఏటా 4.9 మిలియన్ మరణాలు ఇదే కారణంగా సంభవిస్తున్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. దేశంలో 10.9 శాతం మంది ఏదో రూపంలో పొగాకు తీసుకుంటున్నారు. ఇందులో 82 శాతం మంది దీని వల్ల సంక్రమించే వ్యాధులతో బాధపడుతున్నారు. 9 లక్షల మంది ప్రతి ఏటా మృత్యువాత పడుతున్నారు. 90 శాతం వూపిరితిత్తుల కేన్సర్లకు పొగ తాగడమే ప్రధాన కారణం. 35 శాతం నోటి క్యాన్సర్లు పొగాకు నమలడం ద్వారా వస్తున్నాయి. పొగ తాగే వారితోపాటు దానిని పీల్చడం వల్ల కుటుంబంలో ఇతరుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. మిగతా వారితో పోల్చితే పొగాకు అలవాటున్న వారిలో 2-3 రెట్లు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పాశ్చాత్య ప్రభావం, ప్రపంచీకరణ ఫలితంగా మహిళల్లోనూ ఈ అలవాటు పెరుగుతోంది.
 
సినిమాలు, టీవీలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రభావంతో చిన్నతనం నుంచే పొగాకు బానిసలవుతున్నారు. దీంతో 20-25 ఏళ్లకే ఎంతోమంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరాలలో పబ్ కల్చర్, హుక్కా సెంటర్లు పెరుగుతున్నాయి. వారాంతాలు ఇక్కడ గడిపేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. పబ్ కల్చర్ వల్ల నెమ్మదిగా పొగాకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా స్నేహితులతో దమ్ము కొట్టినా...చివరికి అలవాటు కింద మారుతోంది. సిగరెట్, సింగార్, బీడీ, తంబాకు, గుట్కా ఇలా ఏ రూపంలో తీసుకున్నా అది శరీరానికి హానికరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగాకు నోటిలో పెట్టి నమలడం ద్వారా నోరు పొక్కడం తద్వారా ఓరల్ కేన్సర్, గొంతు చిన్నగా మారడం, మాట్లాడలేకపోవడం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థి దశ నుంచే ఈ అలవాటు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం.
==మహిళల్లో పెరుగుతున్న అలవాటు==
నగరాలలో పాశ్చాత్య పోకడల కారణంగా మహిళల్లో పొగతాగే అలవాటు పెరుగుతోంది. పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లలో పురుషులు 56 శాతం వరకు ఉంటే...అదే మహిళల్లో ఈ సంఖ్య 44 శాతం వరకు ఉన్నట్లు నివేదికలు ఘోషిస్తున్నాయి. పబ్, పేజ్-3 కల్చర్‌తో పొగ తాగుతున్న మహిళలు కొందరైతే...తంబాకు, గుట్కా తదితర రూపంలో నోటి ద్వారా నములుతున్న వారు కూడా ఉన్నారు. అట్టడుగు వర్గాల మహిళలు పొగాకు వివిధ రూపాల్లో తీసుకొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పొగ తాగే మహిళలు గర్భం దాల్చినప్పుడు శిశువులు అనేక రూపాల్లో పుట్టే ప్రమాదం ఉంది. పిల్లలు పుట్టినా వారిలో ఎదుగుదల సరిగ్గా ఉండదు. తల్లికి ధూమపాన అలవాటు ఉంటే తద్వారా పిల్లలకు కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యవయస్సులోకి రాగానే ఆస్టియోపోరోసిస్ (ఎముకలు పెలుసు బారడం) వంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
21,448

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1161714" నుండి వెలికితీశారు