ధూమపానం: కూర్పుల మధ్య తేడాలు

4,020 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి (వర్గం:ప్రమాదాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
==మహిళల్లో పెరుగుతున్న అలవాటు==
నగరాలలో పాశ్చాత్య పోకడల కారణంగా మహిళల్లో పొగతాగే అలవాటు పెరుగుతోంది. పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లలో పురుషులు 56 శాతం వరకు ఉంటే...అదే మహిళల్లో ఈ సంఖ్య 44 శాతం వరకు ఉన్నట్లు నివేదికలు ఘోషిస్తున్నాయి. పబ్, పేజ్-3 కల్చర్‌తో పొగ తాగుతున్న మహిళలు కొందరైతే...తంబాకు, గుట్కా తదితర రూపంలో నోటి ద్వారా నములుతున్న వారు కూడా ఉన్నారు. అట్టడుగు వర్గాల మహిళలు పొగాకు వివిధ రూపాల్లో తీసుకొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. పొగ తాగే మహిళలు గర్భం దాల్చినప్పుడు శిశువులు అనేక రూపాల్లో పుట్టే ప్రమాదం ఉంది. పిల్లలు పుట్టినా వారిలో ఎదుగుదల సరిగ్గా ఉండదు. తల్లికి ధూమపాన అలవాటు ఉంటే తద్వారా పిల్లలకు కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యవయస్సులోకి రాగానే ఆస్టియోపోరోసిస్ (ఎముకలు పెలుసు బారడం) వంటి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
==పక్కవారి పొగ పీల్చినా ప్రమాదమే==
 
పొగ తాగే వారితోపాటు ఆ పొగ పీల్చే వారిలో 30 శాతం వూపిరితిత్తుల కేన్సర్లు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని 2004లో కేంద్రప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నిషేధించింది. పాఠశాలలకు సమీపంలో ఎలాంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. మైనర్లుకు వీటిని విక్రయించకూడదు. గుట్కా, పాన్‌మసాలాలు అమ్మరాదు. నగరంలో ఈ చట్టం చట్టుబండలైంది. మచ్చుకైనా అమలు కావడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఆ మేరకు ప్రజల్లో చైతన్యం కల్పించాల్సి ఉన్నా పట్టించుకునే వారే లేరు. పార్కులు, సినిమా హాళ్లు, కళాశాలలు, మార్కెట్లు ఇలా అన్ని చోట్లా పొగరాయుళ్లు రెచ్చిపోతున్నారు.
==4 వేల రసాయనాలు==
పొగాకు ఉత్పత్తుల్లో దాదాపు 4 వేల రకాల రసాయనాలు ఉంటాయి. ఇందులో 400 రకాలు కేన్సర్ కారకాలే. మృత దేహాలను భద్రపరచడానికి వాడే రసాయనాలు, బొద్దింకలను చంపడానికి వాడేవి, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు వినియోగించే రసాయనాలు, నాఫ్తలీన్ గోలీల్లో ఉండే రసాయనాలు పొగాకులో నిక్షిప్తమై ఉంటాయి. పొగ తాగడం వల్ల వూపిరితిత్తులతోపాటు అది వెళ్లే మార్గంలో ఉన్న స్వరపేటిక, నాలుక, పెదాలతోపాటు గొంతు, ఆహారనాళం కూడా దెబ్బతింటాయి. వూపిరితిత్తుల్లో ఉండే ఇన్‌ఫెక్షన్ ఆహార నాళంలోకి వచ్చి మ్యూకస్ పొర దెబ్బతింటుంది. అల్సర్లు, ఇరిటేషన్, ఎసిడిటీతో ప్రారంభమై చివరికి కేన్సర్‌గా రూపాంతరం చెందుతుంది.
==బయటి లంకెలు==
{{Commons category|Smoking}}
{{Wikivoyage|Smoking}}
*[http://www.bbc.co.uk/headroom/emotional_health/smoking.shtml BBC Headroom] - Smoking advice
*[http://www.cancer.gov/cancertopics/factsheet/Tobacco/cancer Cigarette Smoking and Cancer] – National Cancer Institute
*[http://www.cdc.gov/tobacco Smoking & Tobacco Use] – Centers for Disease Control
*[http://www.ahrq.gov/path/tobacco.htm Treating Tobacco Use and Dependence] – U.S. Department of Health and Human Services
*[http://www.nhs.uk/livewell/smoking/Pages/stopsmokingnewhome.aspx How to stop smoking ] – National Health Service UK
*[http://opinionator.blogs.nytimes.com/2012/08/01/for-teenage-smokers-removing-the-allure-of-the-pack/ NY Times: Responses to the targeting of teenage smokers]
[[వర్గం:ప్రమాదాలు]]
21,448

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1161716" నుండి వెలికితీశారు