ధూమపానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
==4 వేల రసాయనాలు==
పొగాకు ఉత్పత్తుల్లో దాదాపు 4 వేల రకాల రసాయనాలు ఉంటాయి. ఇందులో 400 రకాలు కేన్సర్ కారకాలే. మృత దేహాలను భద్రపరచడానికి వాడే రసాయనాలు, బొద్దింకలను చంపడానికి వాడేవి, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు వినియోగించే రసాయనాలు, నాఫ్తలీన్ గోలీల్లో ఉండే రసాయనాలు పొగాకులో నిక్షిప్తమై ఉంటాయి. పొగ తాగడం వల్ల వూపిరితిత్తులతోపాటు అది వెళ్లే మార్గంలో ఉన్న స్వరపేటిక, నాలుక, పెదాలతోపాటు గొంతు, ఆహారనాళం కూడా దెబ్బతింటాయి. వూపిరితిత్తుల్లో ఉండే ఇన్‌ఫెక్షన్ ఆహార నాళంలోకి వచ్చి మ్యూకస్ పొర దెబ్బతింటుంది. అల్సర్లు, ఇరిటేషన్, ఎసిడిటీతో ప్రారంభమై చివరికి కేన్సర్‌గా రూపాంతరం చెందుతుంది.
==నివారణ చర్యలు==
సిగరెట్ల రేట్లు పదిశాతం మేర పెంచితే, వాటి వాడకం నాలుగైదు శాతందాకా తగ్గుతుందని భారత్‌లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఆ రాబడి పెంపుదలనే చూస్తూ- పొగాకు వ్యాధుల చికిత్స వ్యయభారాన్ని, అపార మానవ వనరుల నష్టాన్ని ఇన్నేళ్లూ పట్టించుకోని హ్రస్వదృష్టి నేతలు ప్రజారోగ్యాన్ని పణంపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు పరిశ్రమ తీరుతెన్నుల్ని క్షుణ్నంగా ఔపోసన పట్టిన ప్రపంచబ్యాంకు ఆర్థికవేత్త హొవార్డ్ బార్నమ్, పొగాకు అంతిమంగా నష్టాలే కొనితెస్తుందని ఏనాడో నిగ్గుతేల్చారు! ప్రజారోగ్య పరిరక్షణతో పోలిస్తే పన్నుల రాబడి ఏమంత ప్రధానం కాదని నిర్ధారించుకున్న ఐస్‌లాండ్, కెనడా, మెక్సికో లాంటిచోట్ల మూడు దశాబ్దాల్లో పొగరాయుళ్ల సంఖ్య ఇంచుమించు 60శాతం మేర పడిపోయింది. డెన్మార్క్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితరాల్లోనూ 45శాతానికిపైగా నియంత్రణ సుసాధ్యమైంది. పొగాకు వినియోగంతోపాటు వివిధ రకాల ఉత్పత్తుల్నీ నిషేధించిన మొట్టమొదటి దేశంగా భూటాన్ నాలుగేళ్లనాడు చరిత్ర సృష్టించింది. దేశంలో 60లక్షలమంది పొగాకు రైతులున్నట్లు అంచనా. వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు, గిరిజన తండాలు, వ్యాపారులు మొత్తం ఆరుకోట్ల మందికిపైగా జీవనం పొగాకుతోనే ముడివడి ఉంది. తగు ప్రోత్సాహకాలతో అంచెలవారీగా పంట మార్పిడికి ఆసరా ఇచ్చి, కార్మికుల బతుకులు వీధిన పడకుండా ప్రత్యామ్నాయ జీవిక చూపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. పొగాకు ఎంత ప్రమాదకరమో పాఠ్యాంశాల్లో బోధించాలి. వూరూరా జనజాగృత కార్యక్రమాలు నిర్వహించాలి.
==బయటి లంకెలు==
{{Commons category|Smoking}}
"https://te.wikipedia.org/wiki/ధూమపానం" నుండి వెలికితీశారు