కృష్ణా నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Krishna River Vijayawada.jpg|thumb|right|200px|[[విజయవాడ]] వద్ద కృష్ణానది]]
[[బొమ్మ:Krishna River 01.JPG|right|thumb|200px|<center>[[మహబూబ్ నగర్]] జిల్లాలో 7వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణానది</center>]]
[[భారతదేశం]]లో మూడవ పెద్ద నది, [[దక్షిణ భారతదేశం]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లోభారతదేశంలో రెండో పెద్ద నది అయిన '''కృష్ణా నది'''ని తెలుగు వారు ఆప్యాయంగా '''కృష్ణవేణి''' అని కూడా పిలుస్తారు. [[పడమటికనుమలు|పడమటి కనులలో]] [[మహారాష్ట్ర]] లోని [[మహాబలేశ్వర్]] కు [[ఉత్తరం]]గా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, [[కర్ణాటక]], [[తెలంగాణ]] మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని [[హంసల దీవి]] వద్ద [[బంగాళా ఖాతము|బంగాళాఖాతం]]లో కలుస్తుంది.
 
== ప్రయాణం ==
[[Image:NASA-GNT.jpg|right|thumb|250px|కృష్ణానది సముద్రంలో కలిసే స్థలం - ఉపగ్రహ చిత్రం]]
ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో [[కొయినా]] నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత '''వర్ణ''', '''పంచగంగ''', '''దూధ్‌గంగ''' లు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక [[బెల్గాం]] జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలో'''ఘటప్రభ''', '''మాలప్రభ''' నదులు కృష్ణలో కలుస్తాయి. [[తెలంగాణ]]లోకి రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు, '''భీమ''' నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి [[రాయచూర్]] జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా [[తంగడి]] వద్ద తెలంగాణలోతెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత [[ఆలంపూర్]] కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది [[తుంగభద్ర]] కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది [[నల్లమల]] కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే [[శ్రీశైలం]], [[నాగార్జున సాగర్]] ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన [[దిండి]], [[మూసి]], [[పాలేరు]], [[మున్నేరు]] వంటివి కలుస్తాయి. [[విజయవాడ]] వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ [[ప్రకాశం బ్యారేజి]]ని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని [[హంసల దీవి]] వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_నది" నుండి వెలికితీశారు