ములుగు పాపయారాధ్యులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==విమర్శలు==
పాపయారాధ్యుల గురించి కందుకూరి వీరేశలింగం పంతులు తన కవుల చరిత్రములో రాస్తూ ఈయన సలక్షణ కవి కాడని పేర్కొన్నాడు. అందుకు కారణం ఆయనకు పాపయ రచనలు సరిగా లభ్యం కాకుండట, లభ్యమైననూ తప్పుడు వ్రాతలతో ఉండుట కారణం కావచ్చని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి భావన. ఇందుకు జవాబుగా తాడేపల్లి వెంకటప్పయ్య సర్వమధుర గ్రంథ పీఠిక యందు పాపయ సలక్షణ కవియేనని వాదము చేశాడు.
==చాటువులు==
పాపయారాధ్యులు తన భార్య లింగైక్యము చెందినపుడు ''ముక్తి ద్వారముతల్పు తీయగదె చాముండీ, జగజ్జీవనీ'' అనే మకుటంతో 24 పద్యాలు రచన చేశాడని ప్రతీతి. అందులో ఉదాహరణకు ఒక పద్యం.
<poem>
శా. సక్తంబయ్యె మదీయ చిత్తము బృహత్సంసార పంకాబ్ధి న
వ్యక్తాతీత భవత్కటాక్షలహరీ వాక్పూర సంస్ఫీతిచే
సిక్తంబౌనటు లార్చి కింకరతచే శిక్షా విధిం గూర్చి నీ
ముక్తి ద్వారము తల్పు తీయ గదె చాముండీ! జగజ్జీవనీ!
</poem>
 
== రచనల జాబితా ==