అంగదుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q3166589 (translate me)
చి Wikipedia python library
పంక్తి 10:
 
 
లంకా యుద్ధంలో అంగదుడు అసమానమైన ధైర్య పరాక్రమాలను ప్రదర్శించాడు. అనేక రాక్షసులను హతమార్చాడు. విపత్కాలంలో వానర సేనకు ధైర్యం చెప్పాడు. గొప్ప రాక్షస మహావీరులు అంగదుని చేత హతమయ్యారు. రెండవరోజు యుద్ధంలో వజ్రదంష్ట్రుడు అనే రాక్షస వీరుడు భీకరంగా వానరసేనపైబడి వారిని చంపేయసాగాడు. అపుడు అంగదుడు అతనిని నిలువరించాడు. వారిద్దరూ భీకరంగా యుద్ధం చేశారు. చివరకు అంగదుడు వజ్రదంష్ట్రుని తల నరికేశాడు.
 
 
[[కుంభకర్ణుడు]] యుద్ధం చేసేటపుడు వానరసేన కకావికలై పోతుండగా వారికి ధైర్యం చెప్పి అంగదుడు యుద్ధానికి ప్రోత్సహించాడు. స్వయంగా కుంభకర్ణుని నిలువరించడానికి ప్రయత్నించాడు. అంగదుడి పిడి దెబ్బకు కుంభకర్ణుడు మూర్ఛిల్లాడు కాని అంతలోనే తేరుకొని అంగదుడిని ఒక్కపోటు పొడిచాడు. దానితో అంగదుడు తెలివి తప్పిపడిపోయాడు. తరువాత కుంభకర్ణుడు రామలక్ష్మణుల బాణాలతో మరణించాడు. కుంభకర్ణుడి మరణం తరువాత త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు వంటి మహారాక్షస వీరులు యుద్ధానికి బయలుదేరారు. వారిలో నరాంతకుడు అంగదునితో భీకరమైన యుద్ధం చేసి అంగదునిచేత మరణించాడు. ఇంద్రజిత్తు మరణం తరువాత యుద్ధానికి వచ్చిన మహాపార్శ్వుడు కూడా అంగదునిచేతనే మరణించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/అంగదుడు" నుండి వెలికితీశారు