అద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 42:
నిర్విశేషమయిన బ్రహ్మమును సాక్షాత్కరింప సామర్థ్యము లేనివారు సవిశేవిబ్రహ్మోపాసనము చేయవలయు. వీరికి సగుణబ్రహ్మోపాసనముచేత మనసు స్వాధీనపడఁగానే నిర్విశేష బ్రహ్మము తానే తోఁచును. సగుణబ్రహ్మోపాసనము చేయువారు అర్చిరాది మార్గముగా బ్రహ్మలోకమును పొంది అందు శ్రవణాదులచేత సాక్షాత్కారము కలిగి బ్రహ్మతోడ మోక్షమును పొందుచున్నారు. కర్మనిష్ఠులు ధూమాది మార్గముగా పితృలోకమును పొంది అందు సుఖానుభవములు చేసి మరల పుణ్యపాపానురూపముగ మనుష్యాది యోనులయందు పుట్టుచున్నారు. నిషిద్ధకర్మములను ఆచరించువారు రౌరవాదినరకములను పొంది అందు పాపానురూపంబుగా దుఃఖములను అనుభవించి మరల కుక్క నక్క మొదలుగాఁగల తిర్యగ్యోనులయందు స్థావరాదియోనులయందును పుట్టి నశించుచున్నారు. నిర్గుణ బ్రహ్మోపాసనము చేయువారు ప్రారబ్ధ కర్మములను మాత్రము అనుభవించి కడమ పుణ్యకర్మములను మిత్రులయందును పాపకర్మములను శత్రువులందును విడిచి కైవల్యమునుపొంది, నిరతిశయానందమును అనుభవించుచున్నారు.
 
ముందు గురువులు అద్వైతం గురించి చెప్పినా, [[శంకరాచార్యులు]] అద్వైతాన్ని క్రమబద్ధీకరించి, తర్కంతో ఋజువు చేసారు. [[ఉపనిషత్తులు]], [[బ్రహ్మసూత్రాలు]], [[భగవద్గీత]] -- ఈ మూడింటినీ కలిపి [[ప్రస్థానత్రయం|ప్రస్థానత్రయి]] అన్నారు. వీటికి అన్నిటికీ సమన్వయం చేకూర్చి, వాటి భావం అద్వైతం అని చాటారు. అప్పటి నుండి అద్వైతం బాగా ప్రచారంలోకి వచ్చింది. కేరళ నుండి ఉత్తరభారతదేశం వరకూ ప్రయాణించి చాలా మంది వేదాంతులతో వాదించి అద్వైతాన్ని నిలబెట్టారు<ref>[http://books.google.com/books?id=Xd_rc7vWaEQC&lpg=PA61&ots=J-xIZYynSR&dq=adi%20sankara%20spread%20hinduism&pg=PA61#v=onepage&q&f=false "గూగుల్ books లో తిరుమంగళకుడి వెంకటరామన్ రచించిన "Discovery of Spiritual India"]</ref>. దేశం నలుమూలలా మఠాలను స్థాపించి ఆయన శిష్యులైన [[పద్మపాదులు]] (తూర్పున పూరి లో), [[హస్తామలకులు]] (పడమరన ద్వారకలో), [[తోటకాచార్యులు]] (ఉత్తరాన జ్యోతిర్మఠంలో), [[సురేశ్వరాచార్యులు]] (దక్షిణంలో శృంగేరి లో) దేశం నలువైపులా మఠాలను ఏర్పరిచారు. ఆ తఱువాత ఆ మఠాలలో ప్రతీ గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసి గురుపరంపర కొనసాగిస్తున్నారు.
 
 
"https://te.wikipedia.org/wiki/అద్వైతం" నుండి వెలికితీశారు