అయిజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=అయిజా||district=మహబూబ్ నగర్
| latd = 16
| latm = 1600
| latm lats = 0051
| lats latNS = 51N
| latNS longd = N77
| longd longm = 7740
| longm longs = 4013
| longs longEW = 13E
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline58.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=అయిజా |villages=20|area_total=|population_total=70680|population_male=35890|population_female=34790|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=32.93|literacy_male=44.25|literacy_female=21.27}}
'''అయిజా''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. పిన్ కోడ్: 509127. ఈ గ్రామము డివిజన్ కేంద్రమైన [[గద్వాల]] నుండి 35 కిలో మీటర్ల దురంలో ఉంది. గద్వాల డివిజన్ లోనే ఇది అతిపెద్ద మేజర్ [[గ్రామ పంచాయతి]]. ఈ గ్రామ జనాభా సుమారు 25 వేలు. గద్వాల నుండి [[మంత్రాలయము|మంత్రాలయం]] వెళ్ళు మార్గములో ఈ గ్రామము కలదు. [[కర్నూలు]] నుండి [[రాయచూరు]] వెళ్ళు రోడ్డు మార్గము కూడా ఈ గ్రామ సమీపం నుంచే వెళ్తుంది.
పంక్తి 14:
 
==2009 ఎన్నికలు==
[[2009]], [[ఏప్రిల్ 16]]న జరిగిన పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించుట వలన ఈ గ్రామం రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందింది. గ్రామంలో 17 పోలింగు బూత్‌లను ఏర్పాటుచేయగా పోలింగ్ బూత్‌లలో ప్రవేశించిన దుండగులు ఎలక్ట్రానిక్ పోలింగ్ యంత్రాలను ధ్వంసంచేసి పోలింగ్ జరుగకుండా అడ్డుకున్నారు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 17-04-2009</ref> మళ్ళీ [[ఏప్రిల్ 18]]న 17 పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ నిర్వహించగా కేవలం 9.65% మాత్రమే పోలింగ్ అయింది.<ref>ఈనాడు దినపత్రిక, మెయిన్ పేజీ, తేది 18-04-2009</ref> ఇది రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అరుదైన సంఘటన.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 19-04-2009</ref> రెండు పోలింగ్ కేంద్రాలలో ఒకే ఒక్క ఓటు పోల్ అయింది. గ్రామంలోని మొత్తం 10961 ఓటర్లకుగాను 1059 ఓటర్లు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయిజ మండలాన్ని గద్వాల నియోజకవర్గం నుండి విడదీసి ఆలంపూర్ నియోజకవర్గంలో కలపడానికి నిరసనగా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
== గ్రామ చారిత్రక పురుషులు ==
;వేంకటనరసింహాచార్యులు: అయిజ గ్రామానికి చెందిన వీరు గొప్ప విద్వాంసులు, పండితులు. వేదశాస్త్రపారంగతులు. [[ఉత్తనూర్]] గ్రామానికి చెందిన శ్రీగోపాలదాసు గారి శిష్యులు. మధ్వాచార్య కృత గ్రంథాలకు పాఠ ప్రవచనములు చేసిన వాడు. వీరి కుమారుడు వ్యాసతత్త్వజ్ఞులుగా పేరుగాంచిన వేంకటరామాచార్యులు<ref> గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-32</ref>.
"https://te.wikipedia.org/wiki/అయిజ" నుండి వెలికితీశారు