"క్రిమి సంహారకాలు" కూర్పుల మధ్య తేడాలు

 
ఈ వికర్షకాల కన్నా కిటికీలకు, ద్వారాలకు ప్రత్యేకమైన తెరలను అమర్చుకోవడం ద్వారా దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. అన్నిటికన్నా మనం మన పూర్వీకులు వాడుకున్నట్లే పడుకునే మంచాలకు దోమ తెరలను కట్టుకోవడం ఉత్తమం.
==దోమల నివారిణులతో ముప్పేమీ లేదు==
దోమల నుంచి తప్పించుకోవటానికి ఉపయోగించే 'మస్కిటో రిపల్లెంట్' వంటి నివారిణుల వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్ప్రభావం పడదని పరిశోధకులు తేల్చారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. 'మస్కిటో రిపల్లెంట్'ల తయారీలో ఉపయోగించే డీఈఈటీ అనే రసాయనం వల్ల మెదడు పనితీరుపై అననుకూల ప్రభావం పడుతుందన్న ఆందోళనలున్నాయి. ఈ నేపథ్యంలో లండన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం జరిపారు. ఆరోగ్యంపై డీఈఈటీ చూపే ప్రభావం గురించి ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలు వెల్లడించిన వివరాలను పరిశీలించారు. డీఈఈటీతో దుష్ప్రభావం పడుతుందని చెప్పటానికి తగిన రుజువులు లేవని వీరు చివరికి తేల్చారు. అదేసమయంలో, డీఈఈటీతో తయారైన మస్కిటో రిపల్లెంట్‌లు దోమకాటును నివారించి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. డీఈఈటీతో 'ఎన్‌సెఫలోపతీ' అనే మెదడు సంబంధ అనారోగ్యం తలెత్తిన కేసులు 1957 నుంచి 14 మాత్రమే ఉన్నాయని తెలిపారు. <ref>http://www.dailymail.co.uk/health/article-2646624/DEET-mosquito-repellent-safe-British-scientists-say-benefits-insecticide-linked-brain-disease-outweigh-dangers.html</ref>
==మూలాలు==
<references/>
==బయటి లంకెలు==
*[http://www.boldsky.com/home-n-garden/improvement/2014/five-natural-mosquito-repellent-to-make-at-home-040166.html ఇంట్లోనే తయారుచేసుకోగల సహజసిద్ద దోమల నివారిణులు]
[[వర్గం:రసాయన పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1166396" నుండి వెలికితీశారు