"అరుణాచల్ ప్రదేశ్" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1162 (translate me))
చి (Wikipedia python library)
area_magnitude=10 |
population_year=2001 |
population=1,091,117 |
population_rank=26 |
population_density=13 |
}}
 
'''అరుణాచల్ ప్రదేశ్ (अरुणाचल प्रदेश)''' (''Arunachal Pradesh'') [[భారత దేశము]]లోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని [[టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము]]లో భాగమని [[చైనా]] వాదన. <!--claim-->. భారత మరియు చైనాల మధ్య వివాదాస్పదముగా మిగిలిన ప్రాంతాలలో [[అక్సాయి చిన్]] తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన [[అస్సాం]] రాష్ట్రము, ఆగ్నేయాన [[నాగాలాండ్]], తూర్పున [[బర్మా]], పశ్చిమాన [[భూటాన్]] సరిహద్దులుగా కలవు. [[ఇటానగర్]] రాష్ట్ర రాజధాని.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన [[మెక్‌మెహన్ రేఖ]]ను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 [[పిన్యిన్]]:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము యొక్క ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించినది: (పశిమము నుండి తూర్పుకు) [[కోన కౌంటీ]], [[లుంఝే కౌంటీ]], [[నంగ్ కౌంటీ]], [[మైయిన్లింగ్ కౌంటీ]], [[మేదోగ్ కౌంటీ]], మరియు [[ఝాయూ కౌంటీ]]. అయితే అదే సమయములో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక [[వాస్తవాధీన రేఖ]] ను నిర్ణయించాయి. ఈ వివాదం ఎంటువంటి అందోళనలకు దారితీసే అవకాశము లేదని భావిస్తున్నారు.
 
ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతము గా పిలవబడుతున్న ఈ ప్రాంతము [[1987]] వరకు అస్సాం రాష్ట్రములో భాగముగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైనది.
ఇక్కడి గిరిజనుల తొలి పూర్వీకులు అవగత చరిత్రకు మునుపే టిబెట్ నుండి ఇక్కడికి వలస వచ్చారు. తరువాతి కాలంలో థాయి, బుర్మా నుండి వలస వచ్చిన వారు వీరితో చేరారు.
 
'''అపతానీ ''' అనే తెగకు చరిత్ర గురించిన అవ్గాహన ఉన్నప్పటికీ, రాష్ట్ర వాయవ్య ప్రాంత భాగాల గురించి తప్ప మిగతా ప్రాంతం గురించి పెద్దగా తెలియదు. లభ్యమౌతున్న చరిత్ర 16 వ శతాబ్దం నాటి అహోం చరిత్ర గాధలు మాత్రమే. గిరిజన మోన్‌పా, షెర్దూక్‌పెన్ తెగలవారు స్థానిక పాలకుల గురించిన చరిత్రను రికార్డు చేస్తూ వచ్చారు. వాయవ్య ప్రాంతాలు క్రీ.పూ. 500, క్రీ.శ. 600 మధ్య విలసిల్లిన మోన్‌పా రాజ్య ఏలుబడిలోకి వచ్చాయి. తరువాత ఉత్తర ప్రాంతాలు టిబెట్ పాలనలోకి వచ్చాయి. రాష్ట్రం లోని మిగత ప్రాంతాలు, ముఖ్యంగా మయాన్‌మార్ కు చేరువగా ఉన్న ప్రాంతాలు అహోంల పాలనలోకి వచ్చాయి. [[1858]] లో ఈ ప్రాంతాలను బ్రిటిషు వారు భారత్ లో కలిపేసారు.
 
పశ్చిమ సియాంగ్ లోని సియాంగ్ పర్వత పాదాల వద్ద గల 14 వ శతాబ్దపు హిందూ దేవాలయం, మాలినీతన్ గుడి శిథిలాల తవ్వకాల్లో రాష్ట్ర పురాతన చరిత్ర గురించిన కొత్త విషయాలు తెలిసాయి. హిందూ దేవతల బొమ్మలు, మండపాలు బయల్పడ్డాయి. స్థానికలకు ఇది తీర్థయాత్రాస్థలంగా మారిపోయింది. భిస్మాక్‌నగర్ వద్ద గల మరో సాంస్కృతిక స్థలం వద్ద లభించిన ఆధారాలను బట్టి ఇక్కడ స్థానిక నాగరికత వర్ధిల్లిందని తెలుస్తోంది. తవాంగ్ జిల్లాలో గల మూడో సాంస్కృతిక వారసత్వ స్థలం, తవాంగ్ బౌద్ధారామం వద్ద బౌద్ధ మతావలంబీకులైన తెగల ప్రజల చరిత్రకు చెందిన ఆధారాలు దొరికాయి.
 
=== వాతావరణము ===
అరుణాచల్ ప్రదేశ్ లో వాతావరణం ఎత్తును బట్టి మారుతూ ఉంటుంది. టిబెట్ సరిహద్ద్దుకు దగ్గరగా, ఎగువ హిమాలయాల వద్ద ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో అతిశీతల వాతావరణం నెలకొని ఉంటుంది. మధ్య హిమాలయాల వద్ద సమశీతోష్ణ స్థితి ఉంటుంది. యాపిల్, కమలా పండ్ల వంటివి పండుతాయి. దిగువ హిమాలయాలు, సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణ వాతావరణం ఉంటుంది. రాష్ట్రంలో వర్షపాతం చాలా ఎక్కువ; సాలుకు 2,000 నుండి 4,000 మి.మీ (80 నుండి 160 అంగుళాలు) వర్షపాతం నమోదవుతుంది. పర్వత సానువుల్లో రోడోడెండ్రన్, ఓక్, పైన్, మేపుల్, ఫర్, జూనిపర్ మొదలైన వృక్షాలతో కూడిన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.
 
== పాలనా విభాగాలు ==
 
== రాజకీయాలు ==
అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి [[గెగోంగ్ అపాంగ్]] నాయకత్వమున [[అరుణాచల్ కాంగ్రెస్]] పార్టీ అధికారములో ఉంది. [[అరుణాచల్ కాంగ్రెస్ (మిత్తి)]], [[కాంగ్రెస్ (డోలో)]] మరియు [[పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్]] లు రాష్ట్రములోని ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.
 
== రవాణా ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1166401" నుండి వెలికితీశారు