తిరుచానూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 25:
== చరిత్ర ==
==విశేషాలు==
దీనిని అలమేలు మంగా పురమని కూడ అంటారు. ఇక్కడ [[వెంకటేశ్వరుడు|వెంకటేశ్వరుని]] దేవేరి [[లక్ష్మీ దేవి]] అవతారమైన [[అలమేలు మంగ]] ఆలయం ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి [[కొల్హాపూర్]] వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో [[కార్తీక శుక్ల పంచమి]] నాడు శుక్రవారం, [[ఉత్తరాషాఢ]] నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.
 
అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి.తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.
 
==చిత్రమాలిక==
<gallery>
దస్త్రం:Koneru . tirucanuru.....2.JPG|తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉద్యాన వనంలో వున్న చిన్న కోనేరు
దస్త్రం:List of arcanas padmavati temple. tirucanuru.JPG|తిరుచానూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందు వున్న అర్చన వివరాలను తెలిపే బోర్డు
దస్త్రం:Padmavati ammavari koneru at tirucanuru. tirupati.JPG|తిరుచానూరు అలమేలు మంగ అమ్మవారి కోనేరు
దస్త్రం:Lotus for sele in front of padmavati temple, tirucanur.JPG|పద్మావతి ఆలయం ముందు తామర పుష్పాలు అమ్ము తున్న దృశ్యం
దస్త్రం:Padmavati ammavari koneru and back temple at tirucanuru, tirupati.JPG|అమ్మ వారి కోనేరు, దాని వెనక వున్నవి అమ్మవారి ఆలయ గోపురాలు
దస్త్రం:Padmavati ammavari koneru and back temple at tirucanuru, tirupati.JPG|పద్మావతి అమ్మవారి కోనేరు, వెనుకనున్నవి అమ్మవారి ఆలయ గోపురాలు
ఫైలు:Padmavathi Ammavaru.jpg|పద్మావతి అమ్మవారు: [[సప్తగిరి]] పత్రిక ముఖచిత్రం.
దస్త్రం:Mandapam at tirucanuru (2).JPG|తిరుచానూరు , శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో వున్న ఒక మండపము
దస్త్రం:Padmavati ammavari koneru at tirucanuru. tirupati.JPG|పద్మావతి అమ్మవారి కోనేరు: తిరుచానూరు:తిరుపతి
దస్త్రం:Main entrance of padmavati ammavari temple tirucanuru.JPG|పద్మావతి అమ్మవారి ఆలయ ప్రధాన గోపురము
దస్త్రం:GaMgudramma mandapam tirucanuru.JPG|తిరుచానూరులో గంగుండ్రమ్మ మండపము.
దస్త్రం:In front of padmavati temple, tirucanuru.JPG|పద్మావతి ఆలయం ముందు కొబ్బరి కాయలను కొట్టు స్థలము.
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, వెతుకు
"https://te.wikipedia.org/wiki/తిరుచానూరు" నుండి వెలికితీశారు