అలవాటు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
'''అలవాటు''' (habit) అనగా ఏదైనా ఒక పనిని మళ్ళీ, మళ్ళీ అదే తడవుగా చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన. వ్యక్తి ప్రమేయము ఉండకపోవచ్చు. అలవాటు అనగానే [[మంచి]], [[చెడు]] రెండూ ఉంటాయి. మంచి అలవాట్లు పరవాలేదు గాని, చెడు అలవాట్లే ఆలోచించదగ్గవి. కొన్ని చెడు అలవాటులు తన చుట్టూ ఉన్నవారికి ఏ హాని చేయవు, కొన్ని అలవాట్లు వ్యక్తికి, ఇతరులకు చెడు చేస్తాయి. కొన్ని ఇతరులకు మాత్రమే [[కీడు]] చేస్తాయి. అలవాటనేది పూర్తిగా మానసికమైనదే. పరిసర వాతావరణము, వ్యక్తులు, జంతువులు, తను చేస్తున్న పని, కుటుంబ ఆర్ధిక - సామాజిక స్థితిగతులు, సహవాసాలు అలవాట్లను ఎంతగానో ప్రభావితము చేస్తాయి. చెడు అలవాట్లకు లోనైన వ్యక్తుల కుటుంబాలు చిన్నా భిన్నమైన ఉదాహరణములెన్నోకలవు. సమాజములో ఆ వ్యక్తికి సరియైన గౌరవముండదు.
 
అలవాట్లలో చిన్నస్థాయి, మధ్యస్థ , పెద్దస్థాయి అనే రకాలుంటాయి. ఈ క్రిందన అవి, ఇవి, అన్నీ కొన్ని ఉదాహరణములుగా చదవండి..
 
==చెడ్డ అలవాట్లు==
===బియ్యము తినడము===
[[బియ్యం]] తినడం చెడ్డదేమి కాకపోయినా తినేవారిలో మానసిక అలజడి, అశాంతి ఉన్నాయని సూచిస్తుంది. ఎంత ప్రయత్నించినా దీనిలోనుంచి బయటకు రాలేకపోతుంటే ఏదైనా మానసిక సమస్యతో కలత చెందుచున్నారేమో ఆలోచించాలి. వాటిని పరిస్కరించే ప్రయత్నము చేయాలి. ఈ అల్వాటు ఆడువారిలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నపిల్లలలో ఉండవచ్చు. పెద్దవారైన మగవారిలో చాలాతక్కువ. కడగని బియ్యం పైన దుమ్ము, [[బాక్టీరియా]] ఉంటాయి, వాటివలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీనివలన ఆకలి తగ్గడం, సమయానికి ఆహారము తీసుకోకపోవడం, సరియైన ఆహారము తినకపోవడం వలన [[రక్తహీనత]], నీరసము రావటం, మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
 
ఈ అలవాటున్నవారు తమకు అందుబాటులో బియ్యం డబ్బా లేకుండా చూసువాలి. బియ్యము తినాలనిపించేటపుడు ఏవైనా [[పండ్లు]], సోపు, బబుల్ గమ్ము, వంటివి నములుతూ ఈ అలవాటును మానే ప్రయత్నము చేయాలి.
 
===పొగ త్రాగడం===
"https://te.wikipedia.org/wiki/అలవాటు" నుండి వెలికితీశారు