అష్టలక్ష్ములు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3345994 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
[[బొమ్మ:ashtalakshmi.jpg|right|250px|thumb|అష్ట లక్ష్ములు, మధ్యలో లక్ష్మీనారాయణులు]]
 
హిందూ సంప్రదాయంలో [[లక్ష్మీదేవి]] సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే '''అష్టలక్ష్ములు'''గా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
 
ఈ అష్టలక్ష్ములు
 
#'''ఆదిలక్ష్మి''' : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
#'''ధాన్యలక్ష్మి''' : ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
# '''ధైర్యలక్ష్మి''' : "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
#'''గజలక్ష్మి''' : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించినది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
#'''సంతానలక్ష్మి''' : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/అష్టలక్ష్ములు" నుండి వెలికితీశారు