ఆంధ్రుల దుస్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
[[File:Watercolour painting on paper of two male figures, possibly Nara and Narayana, twin incarnations of Viṣṇu..jpg|thumb|350px|right|పంచె కండువా ధరించిన నరనారాయణుల చిత్రపటం.]]
దక్షిణ భారతదేశం మొత్తం మీద ఒకే రకమైన దుస్తులున్ననూ, రాష్ట్రాల, వాటి ప్రదేశాల, మతాల వారీగా వీటిలో స్వల్ప తేడాలు గలవు. (మిగతా దక్షిణ రాష్ట్రాలతో పోలిస్తే ఒక్క [[కేరళ]] లో మాత్రం విభిన్న సంస్కృతి ఉండటంతో, ఇక్కడి దుస్తులలో కూడా అంతే వ్యత్యాసం కనబడుతుంది.) దుస్తులలో వైవిద్యాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి.దుస్తుల నేత, వాటిని తయారు చేసే నూలు, వాటికి వాడబడే రంగులు, వాటి తయారీలో ఇతర ముడిసరుకుల వినియోగం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
 
పురుషుల పంచెకట్టు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. [[కోస్తా ఆంధ్ర]] లో [[పంచె]]ని ధోవతి వలె కట్టటం ఎక్కువ. రాయలసీమ లో తమిళుల వలె నడుము చ్టుటూ కట్టే పంచెకట్టు ని ఎక్కువగా వినియోగిస్తారు. వ్యవసాయం/సైకిలు త్రొక్కటం వంటి పనులు చేసే సమయంలో కట్టే ధోవతులు/పంచెకట్టులు, తలపాగా కట్లు, ఇతర సమయాలలో కట్టే కట్లతో భేదాలు కలవు.
 
ఉత్తర భారత స్త్రీలు సాధారణంగా పైట చెంగు కుడి భుజం పై కి కడతారు. [[ఆంధ్ర]] లో (ఆ మాటకొస్తే దక్షిణ రాష్ట్రాలన్నింటిలో) ఇది ఎడమ వైపుకు ఉంటుంది.
పంక్తి 16:
{{Main|తలపాగా}}
 
'''తలపాగా''' అనునది తలని చుట్లతో కప్పే ఒక వస్త్రము. దీనిని ధరించే విధానాలు వేర్వేరుగా ఉంటాయి. తలపాగా మరియు [[పైపంచ]] (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే [[పంచకట్టు]], లాల్చీలాంటి [[చొక్కా]], పైపంచ, తలపాగా .
 
=====[[కుర్తా]]=====
పంక్తి 23:
సాధారణంగా పురుషులు నూలు/ఖద్దరు లేదా నూలుతో కలసిన ఇతర రకాలు (blend) తో తయారు చేసిన కుర్తా (జుబ్బా/లాల్చీ), ధోవతి (పంచె) లని ధరిస్తారు.
 
[[మ్యాండరిన్ కాలర్]] ([[చైనీసు కాలర్]]) తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద [[బొత్తా]]లు ఉండవు. ఛాతీ వద్ద [[కాజా]]లతో కూడిన, లేక [[నొక్కుడు బొత్తా]]లు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. [[జేబు]]లు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు. కుర్తా కి నడుముకు ఇరువైపులా ఒక్కో వెంటు (చీలిక) ఉంటుంది. కాళ్ళ కదలికలకి అడ్డు పడకుండా ఈ వెంటులు ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి. ఒక్కోమారు కుర్తా స్థానంలో [[చొక్కా]]ని కూడా ధరిస్తారు.
 
=====[[పంచె]]=====
పంక్తి 30:
 
 
ఉదర భాగం/పొత్తి కడుపు నుండి రెండు కాళ్ళ మధ్య నుండి వెనక్కి వెళ్ళేలా ధోవతిని కడతారు. కొన్ని ప్రాంతాల (ఎక్కువగా [[రాయలసీమ]])లో ధోవతిని పంచెకట్టుతో ధరిస్తారు. [[యునైటెడ్ కింగ్డమ్]] కి చెందిన [[గ్లాస్గో]] లో ఉత్తమ నూలు ఉత్పత్తి అవటం వలన నాణ్యత గల పంచెలని గ్లాస్గో పంచెలు అని సంబోధిస్తారు. అయితే వీటి వికృతి '''గ్లాస్కో''' పేరే వాటికి స్ధిరపడినది. జారకుండా ఉండటానికి [[మొలత్రాడు]]ని వాడతారు. పంచ, పై పంచ లు సాధారణంగా తెలుపు రంగు లో గానీ, క్రీం కలర్ లో గానీ ఉంటాయి. వీటికి అంచుల్లో రంగులతో నగిషీలు అద్దబడి ఉంటాయి. సాధారణంగా ఈ నగిషీ ఒకే రంగుతో అద్దబడి ఉంటుంది. అంచుల్లో ఉండే ఈ నగిషీ లని కేవలం [[అంచు]] అని గానీ లేదా బార్డర్ (border) అని గానీ వ్యవహరిస్తూ ఉంటారు. బార్డరులు స్త్రీలు ధరించే చీరలు/పై లంగాలు/జాకెట్లు/రవిక లకి కూడా ఉంటాయి. అయితే స్త్రీల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: మామిడి పిందెలు), పురుషుల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: సర్పిలమును పోలినవి) వేర్వేరుగా ఉంటాయి.
 
'''పంచెకట్టు:''' చీరకు వేసే కుచ్చిళ్ళ అంత ఒద్దికగా పెద్దగా కాకుండా, దాదాపు అదేవిధంగా, చిన్నగా నడుముకు ఒక వైపు మాత్రమే గానీ, ఇరువైపుల గానీ, రెండువైపులు బయటకు గానీ లోపలకుగానీ దోపుతారు. (ఒకటి బయటికి, ఇంకొకటి లోపలికి దోపరు.)
 
'''ధోవతి కట్టు:''' పై విధంగా కట్టిన పంచె కి క్రిందికి వ్రేలాడే అంచును కాళ్ళ మధ్య నుండి వెనుకకు తీసుకుపోయి, నడుము వద్ద లోపలికి (మాత్రమే) దోపుతారు. వెనుకకు దోపటం తప్పని సరి కాదు. నడిచే సమయంలో పెద్ద పెద్ద అడుగులు వేసేందుకు వీలుగా దీనిని చేత పట్టుకొనవచ్చును.
 
=====[[కండువా]]=====
పంక్తి 67:
=====టవల్=====
 
వ్యవసాయం, కూలి, నిర్మాణాలలో పని చేసేవారు పై పంచకి ప్రత్యామ్నాయముగా ఒక టవల్ ని వాడతారు. ఇదే టవల్ నే తలపాగా కూడా ధరిస్తారు. అయితే, టవల్ తో పై పంచ, తలపాగా రెండూ అసాంప్రదాయికాలే.
 
=====సైకిల్ కట్టు ధోవతి=====
పంక్తి 73:
{{Main|ధోవతి}}
 
సైకిల్ నడిపే సమయంలో సైకిల్ చక్రాలలో, చైన్ గల పెడల్ చక్రంలో ఇరుక్కుపోకుండా, ధోవతి కట్టే విధానాన్ని సైకిల్ కట్టు అంటారు. [[దసరా బుల్లోడు]], [[జానకిరాముడు]] వంటి చిత్రాలలో కథానాయకులు మోచేతుల వరకు మడచిన కుర్తా, సైకిల్ కట్టు లో ధోవతి ని ధరించి అసాంప్రదాయికంగా కనిపించారు.
 
=====ఆంధ్ర పురుషుల అసాంప్రదాయిక దుస్తుల చిత్రమాలిక=====
పంక్తి 94:
ఇంట్లో ఉన్నప్పుడు, సాంప్రదాయికత అవసరం లేనప్పుడు, వేసవి కాలాలలో పురుషులు వీటిని అత్యధికంగా వాడతారు.
 
చేతులు లేని (sleeveless) బనియను వంటి వస్త్రం పూర్వం ధరించేవారు. ఉదర భాగం వద్ద కుడి ప్రక్క నుండి చేత్తో వస్తువులను వేసుకొనే విధంగా ఒక జేబు వీటికి ఉండేది. ఇవి ఇప్పుడు కనుమరుగైనాయి
 
=====నాడాలు కలిగిన [[లాగు]]=====
{{Main|లాగు}}
 
నాడాలు కలిగిన లాగు భారతదేశ పురుషుల లోదుస్తులలో ఒకటి. దీనిని పంచె/లుంగీల లోపల ధరిస్తారు. సాధారణంగా ఇది నీలి రంగులో ఉండి వాటి మీద వేర్వేరు రంగుల చారలు గల (పైజామాలు కుట్టే ) వస్త్రంతో తయారు చేయబడి ఉంటుంది. వీటికి నాడాలు ఉంటాయి. ఇవి తొడల వరకే ఉంటాయి. సాధారణంగా తొడల వద్ద (బాక్సరు షార్టు వలె) వదులుగా ఉండి, జేబులు లేకుండా ఉంటాయి. కొందరు వ్యక్తిగతంగా నడుముకిరువైపులా జేబులు పెట్టించుకొంటారు.
 
తెల్లని పంచెలు మరీ దళసరిగా ఉన్నప్పుడు కానీ, నీళ్ళలో తడిచినపుడు గానీ, ఆడ్డపంచె కట్టినప్పుడు గానీ, ఇవి కనబడుతుంటాయి.
పంక్తి 129:
=====[[ఛోళీ]]=====
{{Main|ఛోళీ}}
పూర్వం జాకెట్టు కి బదులు గా [[రవిక]] (వికృతి: రైక) ని వాడేవారు. జాకెట్టుకు వక్షోజాల మధ్య అమర్చబడే కొండీలు (హుక్కులు) రవిక కు ఉండవు. వాటి స్థానే రెండు చివరలను మధ్యకి తెచ్చి రవికను ముడి వేస్తారు. [[నరసింహనాయుడు]] చిత్రం లో [[సిమ్రాన్]], [[నందమూరి బాలకృష్ణ]] కి రవిక కీ, జాకెట్టు కీ ఉన్న తేడాలు వివరించటం కలదు. అయితే రవికలని చీరలతోనే కాకుండా, ధోవతి వలె కాలి పిక్కల వరకు కట్టిన చీరలతో కూడా ఉపయోగిస్తారు. [[ఎంకి]] అనే పాత్రకి, జాలరి మహిళకి రూపం, ఎడమ చేతిలో గంప కలిగి ఉండి రవిక మరియు ధోవతి వలె కట్టిన చీరే.
 
దక్షిణాది తో బాటు ఉత్తరాది సినిమాలలో రవిక ను మహిళను శృంగారపూరితంగా చిత్రీకరించటానికి ఉపయోగించటం ఇప్పటికీ చూస్తూనే ఉంటాము.
పంక్తి 136:
{{Main|లంగా ఓణి}}
 
పెళ్ళి కావలసిన యువతులు దైనందిన జీవితాలలో పైట-పావడ (లంగా-పైట/ఓణి)లు వాడతారు. గుళ్ళకి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళేప్పుడు, ఉత్సవాలకి, ఇతరుల నిశ్చితార్థం, పెళ్ళిళ్ళ వంటి శుభకార్యాలకి కూడా సాంప్రదాయికత ఉట్టిపడటం కోసం యువతులు పైట-పావడలలో హాజరు అవుతారు.
 
పెళ్ళి కాబోతోంది కాబట్టి '''లంగా-ఓణీ, నేటితో రద్దయిపోనీ''' అనే పాట [[వర్షం (సినిమా)]] లో ఉంది. [[చంటి]] సినిమా లో కథానాయిక పుష్పించిన సందర్భానికి జరిగే పేరంటానికి నాయికకి లంగా-ఛోళీ నే తొడిగారు. (వాస్తవానికి ఈ సందర్భములో యౌవనాన్ని సూచించే పైట-పావడ నో, లేక పరిపూర్ణత సూచించే చీరకట్టో ఉంటుంది.)
 
====అసాంప్రదాయిక దుస్తులు====
పంక్తి 161:
{{Main|లంగా}}
 
'''లంగా''' భారతీయ [[స్త్రీలు]] ధరించే ఒక రకమైన [[దుస్తులు|దుస్తుల]] లో ఒకటి. లంగా కు నాడాలు ఉంటాయి. ముడి నడుము కి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని నడుము కుడి భాగం నుండి ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా (పావడ/పరికిణీ) .
 
పెళ్ళైనవారు [[చీర]] లోపల కనిపించకుండా ధరిస్తారు. ఇది సామాన్యంగా నూలుతో చేసినదై ఉంటుంది.
పంక్తి 170:
ఈ మధ్య మగపిల్లలలు చొక్కా-లాగు-నిక్కరు వంటివి ధరిస్తున్నారు. కానీ పూర్వం పెద్దవారు ధరించిన ధోవతి, ఉత్తరీయము, లాల్చీ,షరాయి వంటివి ధరించేవారు.
 
ఈ మధ్య ఆడ పిల్లలు మిడ్డీ, ఫ్రాక్,పంజాబీ డ్రస్,గాగ్రా వంటివి ధరిస్తున్నారు. కానీ పూర్వం పరికిణి-జాకెట్టులని మాత్రం ధరించేవారు.
===చిత్రమాలిక===
<gallery>
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రుల_దుస్తులు" నుండి వెలికితీశారు