ఆటలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 39:
== కోతి కొమ్మచ్చి ==
{{ముఖ్య వ్యాసము|కోతి కొమ్మచ్చి}}
ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను '''గిరి''' అని కూడా పిలుస్తారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.
 
== దొంగ పోలీస్ ==
==నేల-బండ==
{{ముఖ్య వ్యాసము|నేల బండ}}
ఈ ఆట ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆడు ఆట. ఈ ఆటను ఎంత మందయినా ఆడవచ్చును. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఈ ఆట ఆడు ప్రదేశమందు మట్టి ప్రదేశము (నేల)మరియు రాతి పృదేశము (బండ)ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో,దొంగ నేల మీద మరియు మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చి దొంగని ఆటపట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించవలెను. ఇదియే దొంగ యొక్క ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ స్థానమును భర్తీ చేస్తారు. ఈ ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట.
 
== తొక్కుడు బిళ్ళ ==
పంక్తి 50:
 
==బొమ్మల పెళ్ళి==
పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు ఆట బొమ్మలను తెచ్చుకుని పెళ్ళి ఆట ఆడుకునేవారు. ఆట బొమ్మలకు పెళ్ళి వస్త్రాలు తొడిగి, వియ్యపువారి బొమ్మలను కూడా పెట్టేవారు. పిల్లలందరూ పెద్దల వేషధారణలో వచ్చి కూర్చుంటారు. పెళ్ళిలోని కన్యాదానం, జీలకర్ర-బెల్లం వంటి ఘట్టాలను నిర్వహించి చివరకు వరుడి బొమ్మ చేతికి చిట్టి మంగళ సూత్రాన్ని తగిలించి వధువు బొమ్మ మెడలో పడేలా చేస్తారు. అయితే సంసారపు శిక్షణ ఇచ్చే ఈ ఆట ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం, ఆధునిక చధువులు, పాశ్చాత్య పోకడల వల్ల నేడు ఆట పూర్తిగా అంతరించిపోయింది. భారతీయ సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రతిబంబించే ఈ ఆటను పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావానికి గురైన నేటి పిల్లలకు తల్లిదండ్రులు తెలిపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది.
 
==గుజ్జన గూళ్ళు==
పంక్తి 80:
[[దస్త్రం:JaquesCookStaunton.jpg‎|thum|ఎడమ నుండి వరుసగా సిపాయి,ఏనుగు,గుర్రం,శకటు,మంత్రి,రాజు]]
 
'''ఆడే విధానం'''ముందు పావులు పేర్చే విధానం.బోర్డు మన ఎదురుగా పెట్టుకున్నప్పుడు మన ఎడమ పక్క చివర నల్ల గడి ఉండాలి. ఆ చివరి గడిలో, ఈ చివరి గడిలో 2 ఏనుగులూ పెట్టాలి. వాటికి లోపలి పక్కన రెండు వైపులా 2 గుర్రాలూ పెట్టాలి. తరువాత శకటాలు, ఇప్పుడు 2 గళ్ళు మిగులుతాయి. 1 నల్లది, 1 తెల్లది. నల్ల పావులు ఐతే నల్ల రాజు తెల్ల గడిలో, తెల్లవైతే తెల్ల రాజు నల్ల గడిలో ఉంచాలి. మిగిలిందాంట్లో మంత్రి లేదా రాణిని ఉంచాలి.
 
'''ఎత్తులు'''
"https://te.wikipedia.org/wiki/ఆటలు" నుండి వెలికితీశారు