ఆయుర్వేదం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
 
== పౌరాణిక గాథలు ==
[[చతుర్వేదాలు|వేదముల]] వలెనే ఇది మొదట [[బ్రహ్మ]]చే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి [[అశ్వినీ దేవతలు]], వారి నుండి [[ఇంద్రుడు]] ఆయుర్వేదమును నేర్చుకున్నారన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన [[అగ్నివేశుడు]] మొదటిగా ''' అగ్నివేశ తంత్రము '''అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగినది. నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉన్నది.
== చారిత్రక ఆభివృద్ధి ==
ఆ గ్రంథమును '''[[చరకుడు]]''' తిరిగి వ్రాసి దానికి [[చరక సంహిత]] అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశీ రాజైన దివోదాస ధన్వంతరి [[సుశ్రుతుడు|సుశ్రుతాది]] శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో '''[[సుశ్రుత సంహిత]] ''' అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను. ఇది పుస్తకరూపంలో [[తక్షశిల]],[[నలందా]] విశ్వవిద్యాలయాలలో లభ్యమౌతుంది.
== ఇతర వైద్యవిధానాలతో పోలిక ==
ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్రవిద్యావిషయాలు మరియు రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు.
"https://te.wikipedia.org/wiki/ఆయుర్వేదం" నుండి వెలికితీశారు