ఆలె నరేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 36:
 
==రాజకీయ జీవితం==
ప్రారంభం నుంచి [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] సభ్యుడైన నరేంద్ర [[1983]] నుంచి [[1994]] మధ్యకాలంలో [[భాజపా]] తరఫున [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభకు [[హిమాయత్‌నగర్]] నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎన్నికైనారు. [[1978]] లో [[ఖైరతాబాదు]] నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.జనార్థనరెడ్డి చేతిలో కేవలం 659 ఓట్ల తేడాతో ఓడిపోయారు<ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.telangana.com/Hyderabad/hyd_poli.htm| title=రాజకీయాలు|publisher=తెలంగాణా.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>. [[1980]] లో హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.ఎస్.నారాయణ చేతిలో పరాజయం పొందినారు. [[1983]] లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పి.ఉపేంద్ర పై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. [[1985]] లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి కె.ప్రభాకరరావుపై గెలుపొందారు. [[1992]] లో హిమయత్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో గెలుపొంది మూడవసారి శాసనసభలొ అడుగుపెట్టారు. [[1994]] లో [[తెలుగుదేశం]] పార్టీకి చెందిన కృష్ణయాదవ్ పై ఓడిపోయారు.[[1999]] లో [[భారతీయ జనతా పార్టీ ]] తరఫున లోక్‌సభకు [[కాంగ్రెస్]] పార్టీకి చెందిన బాగారెడ్డిపై విజయం సాధించి తొలిసారి లోక్‌సభ సభ్యులైయ్యారు. [[2003]] వరకు భాజపా లో మంచి పేరు సంపాదించుకొని అభిమానులచే టైగర్‌గా పిలుపించుకున్నారు. ప్రత్యేక [[తెలంగాణా]] వాదంతో కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించిన పార్టీలో చేరి ఆ పార్టీలో రెండో ముఖ్య నాయకుడిగా వ్యవహరించారు. [[2004]] లో మళ్ళీ మెదక్ నియోజకవర్గం నుంచి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] తరఫున పోటీ చేసి భాజపాకు చెందిన పి.రామచంద్రారెడ్డిపై 1,23,756 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో పర్యాయం లోక్‌సభలో అడుగుపెట్టడమే కాకుండా [[మే 23]] న కేంద్రంలో [[మన్మోహన్ సింగ్]] నేతృత్వం లోని యుపిఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిపదవిని పొందారు.
 
నకిలీ వీసా కేసులో చిక్కుకొని [[ఏప్రిల్]] [[2007]] లో తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి బహిష్కృతుడై <ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.rediff.com/news/2007/apr/26ap.htm| title=వార్తలు |publisher=రెడిఫ్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref>, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) అనే కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి జనాదరణ లభించకపోవడంతో [[2008]] [[జనవరి 8]] న [[హైదరాబాదు]] లో [[మాయావతి]] సమక్షంలో [[బహుజన సమాజ్ పార్టీ]] లో చేరారు. <ref>{{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.merinews.com/catFull.jsp?articleID=128999 | title=బహుజన సమాజ్ పార్టీలో చేరిక|publisher=మేరీన్యూస్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref> అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైయ్యారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ఆలె_నరేంద్ర" నుండి వెలికితీశారు