"ఇది కథ కాదు" కూర్పుల మధ్య తేడాలు

14 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (Wikipedia python library)
}}
 
'''ఇది కథ కాదు''', 1979లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[కె.బాలచందర్]] దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. విభిన్నమైన మనస్తత్వాలను దర్శకుడు చాలా నైపుణ్యంతో తెరకెక్కించాడు. "[[వెంట్రిలోక్విజమ్]]" ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ "గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను" అంటుంది. [[చిరంజీవి]] ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి.
జయసుధ నటనా ప్రతిభకు అద్దం పట్టే సినిమాల్లో ఒకటి.
 
==సంక్షిప్త కథ==
నర్తకి సుహాసిని (జయసుధ) తను ప్రేమించిన భరణి (శరత్ బాబు)ని పెళ్ళి చేసుకోవడం కుదరక దూరమవుతుంది. వేరే వూరిలో పరిచయమైన సుగుణాకర రావ్ (చిరంజీవి) పెళ్లి చేసుకుంటానంటాడు. అతనికి తన విఫల ప్రేమ సంగతి చెపుతుంది. అయినా అతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళి అయినాక అతను పచ్చి శాడిస్టు అని తెలుస్తుంది. అతనితో వేగలేక జయసుధ తన బిడ్డతో వేరేవూరు వెళ్ళి ఉద్యోగంలో చేరుతుంది.
 
 
క్రొత్త ఆఫీసులో జానీ (కమల్ హాసన్) ఆమెకు సాయంగా నిలుస్తాడు. కమల్ హాసన్ ఒక వెంట్రిలోక్విస్టు. మాట్లాడే బొమ్మ సాయంతో తమాషాగా మాట్లాడుతూ అందరినీ ఉత్సాహపరుస్తుంటాడు. తను జయసుధను ప్రేమిస్తున్నానని ఆ బొమ్మ అంటుంటుంది కొత్త వూళ్ళో జయసుధ జీవితం నిలదొక్కుకుంటున్న సమయంలో మూడు సంఘటనలు మళ్ళీ ఆమెను కల్లోలంలోకి నెడుతాయి. ఆమె పాత ప్రియుడు (శరత్ బాబు) ఆమెకు దగ్గరవుతాడు. వారి ప్రేమ కొనసాగుతుంది. పెళ్ళి దాకా వెళుతుంది. మనుమడి మీద మమకారంతో చిరంజీవి తల్లి (చిరంజీవికి తెలియకుండా) జయసుధ ఇంట్లో పనిమనిషిగా చేరి ఆమె బిడ్డకు సేవలు చేసుకొంటుంటుంది.
మాజీ శాడిస్టు భర్త (చిరంజీవి) జయసుధ పనిచేసే ఆఫీసులోనే బాస్‌గా వచ్చి ఆమెను కల్లోలపరుస్తాడు, అంతే గాకుండా జయసుధ, శరత్‌బాబుల పెళ్ళి చెడగొడుతాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1167957" నుండి వెలికితీశారు